7 పరుగులకే 5 వికెట్లు.. కట్‌ చేస్తే స్కోర్‌ ఎంతంటే..? | SA20, 2025-26: Capitals recover from 7 for 5 to beat Super Kings | Sakshi
Sakshi News home page

7 పరుగులకే 5 వికెట్లు.. కట్‌ చేస్తే స్కోర్‌ ఎంతంటే..?

Jan 18 2026 9:00 AM | Updated on Jan 18 2026 10:40 AM

SA20, 2025-26: Capitals recover from 7 for 5 to beat Super Kings

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిలిచిపోనుంది. కఠినమైన పిచ్‌పై ఆ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకొని గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. అంతేకాకుండా ఆ స్కోర్‌ను విజయవంతంగా డిఫెండ్‌ చేసుకొని, 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.  

పూర్తి వివరాల్లోకి వెళితే.. జోహనెస్‌బర్గ్‌ వేదికగా నిన్న (జనవరి 17) ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ బ్యాటర్లకు చాలా కఠినంగా ఉండింది. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ 7 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ (47 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)–షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (50 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అనూహ్య పోరాటం చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రెవిస్‌-రూథర్‌ఫోర్డ్‌ భాగస్వామ్యానికి ముందు ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లయ్యారు.

జోబర్గ్‌ బౌలర్లలో డేనియల్‌ వారెల్‌ (4-1-12-2), వియాన్‌ ముల్దర్‌ (4-1-34-2), డుయాన్‌ జన్సెన్‌ (4-0-27-1), బర్గర్‌ (4-0-32-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి క్యాపిటల్స్‌ టాపార్డర్‌ కకావికలమైంది.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ప్రిటోరియా బౌలర్లు అద్భుతంగా డిఫెండ్‌ చేసుకున్నారు. లిజాడ్‌ విలియమ్స్‌ (4-0-25-3), కేశవ్‌ మహారాజ్‌ (4-0-15-3), రోస్టన్‌ ఛేజ్‌ (4-0-11-1), గిడ్యోన్‌ పీటర్స్‌ (3-0-25-1) ధాటికి సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సంబంధం​ లేకుండా క్యాపిటల్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సూపర్‌ కింగ్స్‌ మినుకుమినుకుమంటున్న అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement