మళ్లీ ఓడిన గుకేశ్‌ | Dommaraju Gukesh suffers third defeat | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన గుకేశ్‌

Mar 5 2026 1:31 AM | Updated on Mar 5 2026 1:31 AM

Dommaraju Gukesh suffers third defeat

ప్రాగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌): ప్రాగ్‌ చెస్‌ ఫెస్టివల్‌ మాస్టర్స్‌ కేటగిరీలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌కు మూడో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్, భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరంతో జరిగిన ఆరో రౌండ్‌లో గుకేశ్‌ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 1.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉండటం గమనార్హం. అరవింద్‌ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. 

నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ జోర్డెన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ 4.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.  ఇదే టోర్నీ చాలెంజర్స్‌ విభాగంలో పోటీపడుతున్న ప్రపంచకప్‌ చాంపియన్, భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. థామస్‌ బీర్డ్‌సన్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను దివ్య 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రస్తుతం దివ్య మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement