పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్, భారత నంబర్ వన్ ఇరిగేశి అర్జున్... ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో అర్జున్ 2–0తో పెట్రోవ్ మార్టిన్ (బల్గెరియా)పై... గుకేశ్ 1.5–0.5తో నోగేర్బెక్ కాజిబెక్ (కజకిస్తాన్)పై గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కార్తీక్ వెంకటరామన్ కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో హరికృష్ణ 1.5–0.5తో నెస్తేరోవ్ (రష్యా)పై, కార్తీక్ వెంకటరామన్ 1.5–0.5తో అరవింద్ చిదంబరం (భారత్)పై విజయం సాధించారు.


