విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలి విజయం అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఐదో రౌండ్ గేమ్‌లో గుకేశ్ 51 ఎత్తుల్లో థాయ్ డాయ్ వాన్ నుగుయెన్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. తొలి నాలుగు రౌండ్ గేమ్‌లను గుకేశ్ ‘డ్రా’గా ముగించడం గమనార్హం.
14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఐదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్ 3 పాయింట్లతో ఐదో స్థానంలో... ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... అరవింద్ చిదంబరం 1.5 పాయింట్లతో 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత నేడు ఆరో రౌండ్ గేమ్‌లు జరుగుతాయి.


