breaking news
Sherfane Rutherford
-
WI Vs PAK: అథనాజ్, రూథర్‌ఫర్డ్ మెరుపులు వృథా.. మీరు మారరు!
వెస్టిండీస్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్.. తాజాగా పాకిస్తాన్‌కు కూడా పొట్టి సిరీస్ (WI vs PAK T20Is)ను సమర్పించుకుంది. ఫ్లోరిడా వేదికగా సోమవారం నాటి మూడో టీ20లో ఓడిపోయి.. 1-2తో పరాజయాన్ని చవిచూసింది.రాణించిన ఓపెనర్లుకాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. మొదటి మ్యాచ్‌లో పాక్, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలిచాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (53 బంతుల్లో 74), సయీమ్ ఆయుబ్ (66) అర్ధ శతకాలతో రాణించి శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ హసన్ నవాజ్ (15), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారీస్ (2) మాత్రం విఫలమయ్యారు.ఆఖర్లో ఖుష్ దిల్ (6 బంతుల్లో 11) కాస్త వేగంగా ఆడగా.. ఫాహీమ్ అష్రాఫ్ (3 బంతుల్లో 10) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 189 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.అథనాజ్, రూథర్‌ఫర్డ్ మెరుపులు వృథాఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ జెవెల్ ఆండ్రూ (15 బంతుల్లో 24) రాణించాడు. కానీ వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (7) నిరాశపరచగా.. రోస్టన్ ఛేజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ అలిక్ అథనాజ్, నాలుగో నంబర్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అథనాజ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేయగా.. రూథర్‌ఫర్డ్ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు.అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించలేదు. హోల్డర్ డకౌట్ కాగా.. రొమారియో షెఫర్డ్ (4), గుడకేష్ మోటి (10) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన వెస్టిండీస్.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పర్యాటక పాకిస్తాన్ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్, హ్యారీస్ రవూఫ్, సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీం ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా గత టీ20 సిరీస్‌లో విండీస్.. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘మీరు మారరు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విండీస్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్ -
రసెల్, నరైన్ కొనసాగింపు.. కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర వీరులు
దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు జరుగనుంది. ఈ సీజన్లో కోసం లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొదటి దశ సెలెక్షన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇవాళ (జులై 7) లీగ్ నిర్వహకులు జట్ల వివరాలను వెల్లడించారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 23 మంది ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఇందులో ఎనిమిది మందిని రీటైన్ కానీ డైరెక్ట్ సైనింగ్ కానీ చేసుకోవచ్చు. మిగతా బెర్త్‌లను తొలిసారి వేలం ద్వారా భర్తీ చేయనున్నారు.తొలి దశ ఎంపిక ప్రక్రియలో అన్ని ఫ్రాంచైజీలు విధ్వంసకర బ్యాటర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, ఆలీషాన్ షరాఫును రిటైన్ చేసుకొని, కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లను ఎంపిక చేసుకుంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లైన అలెక్స్ హేల్స్, లియామ్ లివింగ్‌స్టోన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లను కొత్తగా అక్కున చేర్చుకుంది.మరో ఫ్రాంచైజీ డెజర్ట్ వైపర్స్ డాన్ లారెన్స్, డేవిడ్ పెయిన్, ఖుజైమా బిన్ తన్వీర్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్ హోల్డన్, సామ్ కర్రన్, వనిందు హసరంగను రీటైన్ చేసుకొని, ఆండ్రియస్ గౌస్‌ను కొత్తగా సైన్ చేసుకుంది.దుబాయ్ క్యాపిటల్స్ విషయానికొస్తే.. దసున్ షనక, దుష్మంత చమీరా, గుల్బదిన్ నైబ్, రోవ్‌మన్ పోవెల్, షాయ్ హోప్‌ను రీటైన్ చేసుకొని, కొత్తగా లూక్ వుడ్, వకార్ సలాంఖీల్, ముహమ్మద్ జవాదుల్లాను సైన్ చేసుకుంది.గల్ఫ్ జెయింట్స్ ఆయాన్ అఫ్జల్ ఖాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, మార్క్ అదైర్‌ను రీటైన్ చేసుకొని.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొయిన్ అలీ, రహ్మానుల్లా గుర్బాజ్‌ను సైన్ చేసుకుంది.ఎంఐ ఎమిరేట్స్ అల్లా ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూకీ, కుసాల్ పెరీరా, రొమారియో షెపర్డ్, టామ్ బాంటన్, ముహమ్మద్ వసీంను రీటైన్ చేసుకొని.. క్రిస్ వోక్స్, కమిందు మెండిస్‌ను సైన్ చేసుకుంది.షార్జా వారియర్జ్ జాన్సన్ ఛార్లెస్, కుసాల్ మెండిస్, టిమ్ సౌధి, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ను రీటైన్ చేసుకొని.. మహీశ్ తీక్షణ, సికందర్ రజా, సౌరభ్ నేత్కావల్కర్, టిమ్ డేవిడ్‌ను సైన్ చేసుకుంది. -
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా విజయ్‌కుమార్ వైశాఖ్‌ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్‌లోకి వచ్చేసింది. రూథర్‌ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్‌కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్‌ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్‌లో వైడ్లు, ఫుల్ టాస్‌లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్‌కుమార్ వైశాఖ్‌కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్‌లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్.. విండీస్‌దే సిరీస్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్‌ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.అనంతరం.. సెయింట్ కిట్స్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది.స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళబంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ తాంజిద్ హసన్(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్ తంజీమ్ హసన్ సకీబ్ 45 పరుగులతో రాణించాడు. స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్ బ్యాట్ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్ఇక విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు సాధించాడు.మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ 49 రన్స్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ షాయీ హోప్(17)తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్ పేసర్ జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్- విండీస్ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు -
WI Vs BAN: రూథర్ ఫర్డ్ విధ్వంసం.. బంగ్లాను చిత్తు చేసిన వెస్టిండీస్
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్‌ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!? -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
విండీస్ ప్లేయర్ సిక్సర్ల సునామీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన రసెల్, రూథర్‌ఫోర్డ్ జోడీ
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో రసెల్, రూథర్‌ఫర్డ్ జోడీ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్‌లో పపువా జోడీ ఆరో వికెట్‌కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్‌కు అజేయమైన 101 పరుగులు జోడించింది. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్‌ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్‌ఫోర్డ్‌తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. -
WI Vs AUS 3rd T20I : రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. 29 బంతుల్లోనే!
Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్‌రేటుతో 71 రన్స్ సాధించాడు. ఆసీస్ బౌలింగ్‌ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. Bang! Andre Russell is seeing them nicely at Perth Stadium. Tune in on Fox Cricket or Kayo #AUSvWI pic.twitter.com/DoUaQghJiZ — cricket.com.au (@cricketcomau) February 13, 2024 కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రూథర్‌ఫర్డ్, రసెల్ దంచికొట్టారు టాపార్డర్ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్ చేజ్(20 బంతుల్లో 37), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్‌ఫర్డ్ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్‌ఫర్డ్‌కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రసెల్.. స్పెన్సర్ జాన్సెన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డే సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి
కెనడా టీ20 లీగ్ 2023 విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు ఎవరూ ఊహించిన అవార్డు లభించింది. సాధరణంగా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌కు ఓ ట్రోఫీతో పాటు క్యాష్ రివార్డు కూడా అందజేస్తారు. కొన్ని సార్లు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌లకు ఖరీదైన బైక్స్, కార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ కెనడా గ్లోబల్ టీ20 లీగ్ నిర్వహకులు మాత్రం విన్నూతంగా ఆలోచించారు. మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ రూథర్‌ఫోర్డ్‌కు అవార్డు రూపంలో విచిత్రంగా అర ఎకరం భూమి ఇచ్చారు. అది కూడా అగ్ర రాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇదెక్కడి అవార్డురా బాబు.. ? ఇప్పటివరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 మరి కొంత మంది డబ్బులు కంటే భూమి విలువైనది అంటూ వారి అభ్రిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో రుథర్ ఫర్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మాంట్రియాల్ టైగర్స్ చాంపియన్‌గా నిలవడంలో రూథర్‌ఫోర్డ్ కీలక పాత్ర పోషించాడు. 29 బంతుల్లో 38 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 చదవండి: IND vs WI: నికోలస్ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే? -
రెచ్చిపోయిన రసెల్, రూథర్‌ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్‌వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
విండీస్ ఆటగాడి ఒంటరి పోరాటం.. 5 వికెట్లతో చెలరేగిన అఫ్రిది
గ్లోబల్ టీ20 కెనడా లీగ్-2023లో భాగంగా వాంకోవర్ నైట్స్‌తో నిన్న (ఆగస్ట్ 5) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మాంట్రియాల్ టైగర్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో రెండో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో మాంట్రియాల్ టైగర్స్.. సర్రే జాగ్వార్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐదేసిన అఫ్రిది.. క్వాలిఫయర్స్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. అబ్బాస్ అఫ్రిది (4-0-29-5) ధాటికి నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. అఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగగా.. అయాన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. వాంకోవర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (33 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్), కోర్బిన్ బోష్ (28 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు) హర్ష్ ధాకర్ (21 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేయగా.. కెప్టెన్ వాన్ డర్ డస్సెన్, నజీబుల్లా గోల్డెన్ డకౌట్లయ్యారు. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్.. 138 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ అతి కష్టం మీద 9 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విండీస్ ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (34 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరిపోరాటం చేసి మాంట్రియాల్‌ను గెలిపించాడు. అతనికి దీపేంద్ర సింగ్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు), ఆండ్రీ రసెల్ (11 బంతుల్లో 17; ఫోర్, 2 సిక్సర్లు), అయాన్ అఫ్జల్ (14 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) సహకరించారు. వీరు మినహా జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వాంకోవర్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఫేబియన్ అలెన్, కోర్బిన్ బోష్ తలో 2 వికెట్లు, రూబెన్ ట్రంపెల్మెన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్
అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టి20లో షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్‌ఫోర్డ్ దెబ్బకు యూసఫ్ పఠాన్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో యూసఫ్ పఠాన్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్‌ఫోర్డ్. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్‌తో సిక్సర్ తరలించాడు. దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫోర్డ్ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్‌తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్‌ఫోర్డ్ రనౌట్‌గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్‌ఫోర్డ్(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC. 5 back to back 6’s 😯 Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh — International League T20 (@ILT20Official) February 2, 2023 చదవండి: ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు -
IPL 2022: వెస్టిండీస్ యువ ఆటగాడికి బంపరాఫర్.. ఏకంగా
వెస్టిండీస్ యువ ఆటగాడు అష్మీద్ నెడ్ బంపరాఫర్ కొట్టేశాడు. ఐపీఎల్-2022 సీజన్లో భాగమయ్యే అవకాశం దక్కించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు అతడు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అష్మీద్కు ఈ ఛాన్స్ రావడంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న షెర్ఫానె రూథర్‌ఫర్డ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా అండర్ 19 ప్రపంచకప్-2018 టోర్నీలో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన నెడ్.. ఆ తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడాడు. ఆ ఈవెంట్లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు వికెట్లు తీశాడు. ఇక గయానాకు చెందిన ఈ 21 ఏళ్ల యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ 2019లో లిస్ట్ ఏ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 12 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లోనూ భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో నెడ్ మాట్లాడుతూ.. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్లతో మమేకమయ్యే అవకాశం ఉంటుందని హర్షం వ్యక్తం చేశాడు. వారి ఆట తీరును గమనిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరచుకుంటానని పేర్కొన్నాడు. కాగా మంగళవారం(ఏప్రిల్ 12) నెడ్ ఇండియాకు పయనం కానున్నట్లు సమాచారం. కాగా గతంలో ఐపీఎల్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ వంటి యువ కెరటాలు ప్రస్తుతం కీలక ఆటగాళ్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: జోరు మీదున్న సన్‌రైజర్స్‌కు భారీ షాక్! కీలక ఆటగాడు దూరం!