ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బెస్ ప్రెస్‌కు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.
కాగా గత సీజన్ వేలంలో రూథర్ ఫర్డ్‌ను రూ. 2.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఈ కరేబియన్ ఆటగాడు ఇప్పుడు అదే ప్రైస్ ట్యాగ్‌తో ముంబైకి మారాడు. ఐపీఎల్-2025లో రూథర్ ఫర్డ్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి గుజరాత్ అతడిని ట్రేడ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే నమన్ ధీర్ వంటి సూపర్ ఫినిషర్ ఉండడంతో రూథర్‌ఫర్డ్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Poore #CricketTwitter ko hila daala na? 😎🔥 pic.twitter.com/wuizRDyvwM
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
27 ఏళ్ల షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ విండీస్ తరపున ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున 44 టీ20లు ఆడాడు. ఆండ్రీ రస్సెల్‌తో కలిసి టీ20ల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(139) నెలకొల్పిన రికార్డును అతడు కలిగి ఉన్నాడు. ఇక 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన రూథర్ ఫర్డ్.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ముంబై తరపున మళ్లీ ఆడనున్నాడు.


