ఐపీఎల్-2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ (MI) తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఈ మినీ వేలానికి ముందు జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీని ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నబీ శుక్రవారం ఘన్సోలీలోని ఎంఐ ఫెసిలిటీలో ట్రయల్స్‌కు హాజరైనట్లు సమాచారం.
అబుదాబి డిసెంబర్ 16న జరగనున్న వేలంలో అతడిని కొనుగోలు చేయాలని ముంబై యాజమాన్యం బావిస్తుందంట. కాగా ఈ 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గత కొన్నాళ్లగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గత రంజీ సీజన్‌లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన నబీ(44).. ప్రస్తత సీజన్‌లో కూడా అద్బుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.
ఈ జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ 29 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అయితే నబీ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. టీ20ల్లో మాత్రం అతడి గణాంకాలు అంత గొప్పగా లేవు. అయినప్పటికి తన పేస్, స్వింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే సత్తా అతడి వద్ద ఉంది. 2019 టీ20ల్లో అరంగేట్రం చేసిన నబీ.. 27 మ్యాచ్‌లలో 26.39 సగటుతో 28 వికెట్లు తీశాడు.
అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 19.98 సగటుతో 125 వికెట్లు పడగొట్టాడు. కాగా మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ స్థానాన్ని నబీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
అర్జున్ ముంబై తరపున రెండు సీజన్లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉండడంతో అర్జున్ పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ముంబై అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు లక్నోకు ట్రేడ్ చేసింది. ప్రస్తుతం ముంబై పర్స్‌లో కేవలం రూ.2.7 కోట్లు మాత్రమే ఉన్నాయి.
చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


