ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ఆదివారం జనం పోటెత్తారు.సెలవు రోజు కావడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ స్టాళ్లను పరిశీలించారు.భారీగా పుస్తకాలు కొనుగోలు చేశారు.కాగా సోమవారం బుక్‌ఫెయిర్ ముగుస్తుందని అధ్యక్ష కార్యదర్శులు యాకూబ్,ఆర్.వాసు తెలిపారు.


