శ్రేయస్‌ కాదు!.. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అశ్విన్‌ | Not Shreyas Ashwin Picks Player Of The Match GT vs PBKS Serving Water | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ కాదు!.. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అశ్విన్‌

Published Wed, Mar 26 2025 5:33 PM | Last Updated on Wed, Mar 26 2025 6:03 PM

Not Shreyas Ashwin Picks Player Of The Match GT vs PBKS Serving Water

Photo Courtesy: BCCI

పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్‌ టైటాన్స్‌ (GT)- పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) మ్యాచ్‌కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్‌ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌
ఐపీఎల్‌-2025లో భాగంగా గుజరాత్‌- పంజాబ్‌ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ దుమ్ములేపింది. 

ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (42 బంతుల్లో 97 నాటౌట్‌), శశాంక్‌ సింగ్‌ (16 బంతుల్లో 44 నాటౌట్‌) అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు.

ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్‌ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (28 బంతుల్లో 46) పంజాబ్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌
అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్‌ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. 

కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్‌)నూ ఫర్వాలేదనిపించాడు.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్‌లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.

ఆ సమయంలో గుజరాత్‌ మొమెంటమ్‌లోకి వచ్చేసింది. రూథర్‌ఫర్డ్‌, బట్లర్‌ మ్యాజిక్‌ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌కుమార్‌ వైశాఖ్‌. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్‌కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్‌ను మనవైపు తిప్పమని మేనేజ్‌మెంట్‌ చెప్పింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అతడికే ఇవ్వాల్సింది
పదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్‌ చేశాడు. అతడు వికెట్‌ తీయకపోవచ్చు. కానీ డెత్‌ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.

తన బౌలింగ్‌లో వైడ్లు, ఫుల్‌ టాస్‌లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్‌ వల్లే గుజరాత్‌ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు విజయ్‌కుమార్‌ వైశాఖ్‌కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. 

కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్‌లో విజయ్‌ 28 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు.
చదవండి: NZ vs Pak: టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement