GT vs PBKS
-
ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు ఆరంభంలో అంతగా అనుకూలించకపోయినా.. తాము మెరుగైన స్కోరు సాధించడం సంతోషమన్నాడు. ఏదేమైనా క్రెడిట్ గుజరాత్ బౌలర్లకు దక్కుతుందని.. వాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 163 పరుగులుసొంతమైదానంలో ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సీజన్ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది.టాపార్డర్ విఫలం కాగా... సూర్యాంశ్ (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... స్టొయినిస్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హోల్డర్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, రబాడ చెరో 2 వికెట్లు తీశారు.సాయి సుదర్శన్ అర్ధశతకంఅనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా... వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్ చెరో 2 వికెట్లు తీశారు.సిరాజ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు... ఈ సీజన్లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్... తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో పంజాబ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి బతికిపోయిన ప్రియాన్ష్ ఆర్య (2) రెండో బంతికి అవుట్ కాగా... తదుపరి బంతికి కూపర్ (0) పెవిలియన్ బాట పట్టాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... నేహల్ వధేరా (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) కూడా అవుటవ్వడంతో పంజాబ్ జట్టు 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్‌తో కలిసి సూర్యాంశ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్ సుతార్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సూర్యాంశ్ వరుసగా 6, 6, 4, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి.ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టొయినిస్, బార్ట్లెట్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసిన హోల్డర్ పంజాబ్‌ను కట్టడి చేశాడు.చక్కగా ఉపయోగించుకున్నారుఈ నేపథ్యంలో పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వికెట్ మీద మేము ఈ మేరకు స్కోరు చేయడం వ్యక్తిగతంగా గొప్ప విషయంగానే భావిస్తున్నా. ముఖ్యంగా కొత్త బంతితో వాళ్లు అటాక్ చేస్తున్న వేళ మేము మెరుగైన ఆరంభమే అందుకున్నాం. అయితే, గుజరాత్ బౌలర్లు ఈ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించారు. పవర్ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. అయినా పుంజుకోగలిగాము. మా బౌలర్లు కూడా మెరుగ్గా ఆడారు. కానీ ఈరోజు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాము. గెలవాలనే ఇక్కడికి వచ్చాము. అయితే, పని పూర్తి చేయలేకపోయాము.SRHపై గెలుస్తాంతదుపరి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఆ జట్టుపై గెలిచి మరో రెండు పాయింట్లు మా ఖాతాలో జమ చేసుకుంటాము’’ అని పేర్కొన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. కాగా పంజాబ్ ఇప్పటికి తొమ్మిదింట ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ పదింట ఆరు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో తొలి ముఖాముఖి పోరులో పంజాబ్ సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్ -
సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గిల్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ముఖ్యంగా పేసర్ మహ్మద్ సిరాజ్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ నాయకత్వ బృందాన్ని భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.రెండు ఓవర్లు వేసి అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత కీలక పేసర్లలో ఒకడైన గుజరాత్ బౌలర్ సిరాజ్ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్ సింగ్ టైటాన్స్ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ ఎక్కువగా బౌలింగ్ చేయనేలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు.సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారు. నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సింది. గాయం కారణంగానా? లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అయితే, పంజాబ్ బ్యాటర్ కూపర్ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్ (44 బంతుల్లో 72 నాటౌట్)తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు. చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’ -
IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్
గతేడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2026లో తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూ చంఢీగగడ్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ మూడు వికెట్లు తీయగా.. యజువేంద్ర చహల్ రెండు, మార్కో యాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.కూపర్ కన్నోలి మెరుపులుఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే తడబడినప్పటికీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 37 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి (Cooper Connolly) 44 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. కన్నోలి మెరుపుల కారణంగా పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026భారీ జరిమానాఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) మాత్రం నిరాశపరిచాడు. తాను విఫలమైనా.. జట్టు గెలుపొందడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న అయ్యర్ (Shreyas Iyer Fined)కు భారీ షాక్ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున అతడికి పెద్ద ఎత్తున జరిమానా పడింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకుగానూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్లో ఇదే తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.చదవండి: IPL 2026: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
ఐపీఎల్-2025 (IPL 2025) ముగింపు దశకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్-1 కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు ఈ పోరుకు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో..సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న గుజరాత్.. తొమ్మిది గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మూడు జట్లకు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఓవరాల్‌గా సీజన్లో రెండు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. మంగళవారం నాటి పోరులో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది.ఈ మ్యాచ్ తర్వాత టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1 ఆడే జట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే జట్లు ఏవో తేలుతాయి. ఇక క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు.. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1 విజేత టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి.ఫైనల్ ఆడే జట్లు ఇవేఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా క్వాలిఫయర్-1, ఫైనల్లో తలపడే జట్లపై తన అంచనా తెలియజేశాడు. పంజాబ్ కింగ్స్‌పై ముంబై, లక్నోపై ఆర్సీబీ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమిస్తాయని జోస్యం చెప్పాడు.అదే విధంగా.. ఈ రెండు జట్లే ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడతాయని అంచనా వేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ముంబై పంజాబ్‌పై గెలవాలని పట్టుదలగా ఉంది. వాళ్లు గనుక గెలిస్తే టాప్-2లోకి వస్తారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆర్సీబీ కూడా అంతే. లక్నోపై ఆ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నా అంచనా ప్రకారం ముంబై- ఆర్సీబీ టాప్-2లో నిలుస్తాయి. అదే విధంగా ఈ రెండు జట్లే ఫైనల్లోనూ తలపడతాయి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.మిగిలిన షెడ్యూల్ ఇలా👉క్వాలిఫయర్-1: మే 29, గురువారం, చండీగఢ్👉ఎలిమినేటర్ మ్యాచ్: మే 30, శుక్రవారం, చండీగఢ్👉క్వాలిఫయర్-2: జూన్ 1, ఆదివారం, అహ్మదాబాద్👉ఫైనల్: జూన్ 3, మంగళవారం, అహ్మదాబాద్.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది -
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా విజయ్‌కుమార్ వైశాఖ్‌ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్‌లోకి వచ్చేసింది. రూథర్‌ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్‌కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్‌ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్‌లో వైడ్లు, ఫుల్ టాస్‌లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్‌కుమార్ వైశాఖ్‌కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్‌లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడి పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయం అందుకోగా.. గుజరాత్ సారథిగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.శ్రేయస్ అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండు పాత్రల్లోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గిల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలే ఓటమికి పరోక్ష కారణాలంటూ విమర్శించాడు.పవర్ ప్లేలో బౌలర్ల మార్పులుముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో గుజరాత్ సారథి విఫలమయ్యాడని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగినట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుగ్గా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడులే అనుకునే సరికి.. అర్షద్ ఖాన్‌ను తీసుకువచ్చాడు.ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?అతడేమో పవర్ ప్లేలోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడనుకుంటా! అదే పంజాబ్‌కు మొమెంటమ్‌ను ఇచ్చింది. ఒకవేళ సిరాజ్ గనుక కొత్త బంతితో రాణిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఆఖర్లోనూ సిరాజ్ బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.కెప్టెన్‌గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలని.. కానీ శుబ్‌మన్ గిల్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఓ బౌలర్ మెరుగ్గా రాణిస్తున్న వేళ.. అతడిని తప్పించి మరొకరిని తీసుకురావడం సరికాదని పేర్కొన్నాడు. గిల్ ఇకనైనా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులలో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేదంటే మున్ముందు గుజరాత్‌కు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.సిరాజ్ ధారాళంగాకాగా గుజరాత్ టైటాన్స్ తమ సొంతమైదానం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం మ్యాచ్ ఆడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన టీమిండియా పేసర్ సిరాజ్.. తొలి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు.మరుసటి ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడను గిల్ బరిలోకి దించగా.. అతడు 8 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సిరాజ్ రంగంలోకి దిగి.. 12 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రబడ ఓవర్లో తొలి వికెట్ దక్కించుకుంది టైటాన్స్.అయితే, వీరిద్దరిని పక్కనపెట్టిన గిల్.. ఐదో ఓవర్లో అర్షద్ ఖాన్‌ను తీసుకురాగా.. అతడు ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మళ్లీ పదిహేనో ఓవర్ దాకా గిల్ సిరాజ్ చేతికి బంతినివ్వలేదు. మళ్లీ ఆఖరి ఓవర్లో సిరాజ్‌ను రంగంలోకి దించగా.. ఈసారి ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.శ్రేయస్ ధనాధన్‌ఈ నేపథ్యంలో సెహ్వాగ్ గిల్ కెప్టెన్సీ తీరుపై పైవిధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అరంగేట్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 47) మెరుపులు మెరిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక మార్కస్ స్టొయినిస్ (15 బంతుల్లో 20) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపులు(16 బంతుల్లోనే 44 నాటౌట్) మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు నమోదు చేసింది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్.. ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.టైటాన్స్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54) అర్ధ శతకాలతో రాణించగా.. శుబ్‌మన్ గిల్(14 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(28 బంతుల్లో 46) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 232 పరుగులకే పరిమితమైన టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్Punjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025


