సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (జనవరి 15) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇదే ఎడిషన్‌లో కొద్ది రోజుల కిందట ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ప్రిటోరియాతో జరిగిన మ్యాచ్‌లో బార్ట్‌మన్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి రాయల్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. బార్ట్‌మన్ (4-1-16-5) ధాటికి 19.1 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హర్డస్ విల్యోన్, సికందర్ రజా తలో 2, ఫోర్టుయిన్ ఓ వికెట్ తీశారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ (25), డెవాల్డ్ బ్రెవిస్ (21), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (29), ఆండ్రీ రసెల్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జోర్డన్ కాక్స్, లిజాడ్ విలియమ్స్, లుంగి ఎంగిడి డకౌటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ 15.1 ఓవర్లలో ఛేదించింది. రూబిన్ హెర్మన్ (46), డాన్ లారెన్స్ (41), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్) ఆ జట్టును గెలిపించారు. ప్రిటోరియా బౌలర్లలో లిజాడ్ విలియమ్స్ 2, ఎంగిడి, పీటర్స్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పార్ల్ రాయల్స్ ఈ ఎడిషన్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. రాయల్స్‌తో పాటు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగతా బెర్త్‌ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి.


