సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్ రాయల్స్ ఆల్‌రౌండర్, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా చివరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్ డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్ డేవిడ్ వీస్‌పై ఎదురుదాడి చేశాడు.
డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్సర్ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రూబిన్ హెర్మన్‌ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
SIKANDAR RAZA, THE FINISHER OF PAARL ROYALS 🥶
- He smashed an iconic six when they needed 2 from the final ball. pic.twitter.com/SrjGLFL31e— Johns. (@CricCrazyJohns) January 14, 2026
వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్ అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్స్ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్ తొలి 5 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్ రాయల్స్ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు.
అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్ ప్లేస్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఉంది. జోబర్గ్ సూపర్ కింగ్స, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్‌టౌన్ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
స్కోర్‌ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (66), లియామ్ లివింగ్‌స్టోన్ (32 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు.
అనంతరం డాన్ లారెన్స్ (63), రూబిన్ హెర్మన్ (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్ రజా (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.


