వంశీ, సాయికృష్ణ, తేజస్విని, అఖిల్, బన్నీ వాసు, సాయిలు
‘‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు బాగా చేరువ చేయడానికి ప్రయత్నించాం. కంటెంట్‌ను జడ్జ్ చేయడంలో మేమంతా మరోసారి విజయం సాధించాం’’ అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు.
వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో సాయిలు కంపాటి మాట్లాడుతూ– ‘‘మా మూవీ సక్సెస్ కావడంతో మాటలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ప్రతి ప్రేమ జంట, ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు డా.నాగేశ్వరరావు. ‘‘ఈ స్టోరీ ప్రేక్షకులకు నచ్చుతుందన్న మా నమ్మకం నిజమైంది’’ అని రాహుల్ మోపిదేవి పేర్కొన్నారు.
‘‘నా పదేళ్ల కష్టానికి ఈ చిత్రంతో ఫలితం దక్కింది’’ అన్నారు అఖిల్ రాజ్. ‘‘మా మూవీ ఎమోషనల్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు’’ అని వేణు ఊడుగుల చెప్పారు. ‘‘ప్రేక్షకాదరణ, ప్రేమ ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేసే ఎనర్జీని అందిస్తోంది’’ అన్నారు వంశీ నందిపాటి. సురేష్ బొబ్బిలి, చైతన్య జొన్నలగడ్డ పాల్గొన్నారు.


