ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక, కళా రంగాల వైభవాన్ని కళ్లకు కట్టారు. నగరంలోని ప్రసాద్ ఐమాక్స్‌లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ చిత్రోత్సవాన్ని శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ప్రాంతీయ భాషా చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రధారణలతో మహిళలు, చిన్నారులు ఆకట్టుకున్నారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో అలరించాయి.


