బుల్లితెర జంట సాయికిరణ్- స్రవంతి గుడ్‌న్యూస్ చెప్పింది. తాము పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్రవంతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చనట్లు పోస్ట్ పెట్టారు. నవంబర్ 19న బుజ్జి బాబు తమ కుటుంబంలో అడుగుపెట్టాడని తెలిపారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా నుంచి సీరియల్ వైపు
సాయికిరణ్‌కు గతంలో పెళ్లయి ఓ పాప కూడా ఉంది. భార్యతో విభేదాల కారణంగా దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇకపోతే నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలతో ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన సాయికిరణ్ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు. వరుస సీరియల్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
గతేడాది పెళ్లి
అలా కోయిలమ్మ సీరియల్‌లో స్రవంతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో స్రవంతి తాను గర్భం దాల్చానని గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే సీమంతం కూడా ఘనంగా జరిగింది. ఇప్పుడు బాబు పుట్టడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
చదవండి: కట్టుబట్టలతో ఇంటి నుంచి పారిపోయి.. అమల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్


