'అఖండ-2' ఫైనల్‌ కలెక్షన్స్‌.. బిగ్‌ లాస్‌ | Akhanda-2 Closing Collections And loss | Sakshi
Sakshi News home page

'అఖండ-2' ఫైనల్‌ కలెక్షన్స్‌.. బిగ్‌ లాస్‌

Jan 5 2026 11:27 AM | Updated on Jan 5 2026 12:32 PM

Akhanda-2 Closing Collections And loss

'అఖండ 2' సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్లెక్కలను ఎప్పటికప్పుడు ప్రకటించే పలు ట్రేడ్వర్గాల ప్రకారం మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. బాలకృష్ణ - బోయపాటి శీనుది హిట్కాంబినేషన్‌.. వీరిద్దరూ కలిసి గతంలో తెరకెక్కించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అఖండ-2పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్పెట్టారని తెలుస్తోంది. అయితే, సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో ఊహించని రేంజ్లో నష్టాలు తప్పలేదు.

రూ. 100 కోట్ల నష్టం
'అఖండ 2'కు సినిమా టికెట్ల పెంపునకు ఇరు రాష్ట్రాల్లో ఛాన్స్దక్కింది. కానీ, లాభాలు రాలేదు. నష్టాలే తెచ్చిపెట్టింది. 2025లో బిగ్గెస్ట్డిజాస్టర్చిత్రాల జాబితాలో చేరిపోయింది. మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ను  14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 'అఖండ 2' వికీపీడియా ప్రొఫైల్లో కూడా ఇదే ఉంది. అయితే, ప్రస్తుతం అఖండ-2 కలెక్షన్స్దాదాపు క్లోజింగ్కు వచ్చేసింది. చాలాచోట్ల ఇప్పటికే సినిమాను తొలగించేశారు కూడా... మరో మూడురోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి వుంది కాబట్టి పూర్తిగా అఖండ-2ను తప్పించడం సహజం. అయితే, ఇప్పటి వరకు చిత్రం రూ. 93 కోట్ల నెట్రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్సాక్నిల్తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.

సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ రావడంతోనే కలెక్షన్స్పై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, అభిమానులకు విపరీతంగా నచ్చిన సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్జనాలకు అంతగా కనెక్ట్అవలేదు.

ఆశగా ఎదురుచూస్తున్న బయ్యర్లు
అఖండ 2 సినిమాను బిజినెస్ పరంగా చూడకూడదని దర్శకుడు బోయపాటి కొద్దిరోజుల క్రితం కామెంట్చేశారు. మూవీకి డబ్బుల సమస్య లేదంటూనే.. కావాల్సినంత కలెక్షన్స్ఎప్పుడో వచ్చేసాయని అన్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ష్కూడా మా డైరక్టర్ చెప్పారు.. అఖండ -2 డబ్బులు ఎప్పుడో వచ్చేశాయి.. నష్టాలు ఏమీ లేవంటూ సంబరపడుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ, బయ్యర్ల పరిస్థితిని తెలుసుకుంటే చాలా దారుణంగా వుంది. అఖండ-2కు సంబంధించి జిఎస్టీలు ఇస్తే కాస్తయినా నష్టాలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement