'ఏజెంట్' మూవీ ఫ్లాప్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయిన అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తొలుత హీరోయిన్‌గా శ్రీలీల అనుకున్నారు. ఆ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఈమె ప్లేసులోకి భాగ్యశ్రీ వచ్చింది. ఈ మధ్య వదిలిన పోస్టర్‍తో ఈ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా నుంచి తొలి గీతాన్ని వదిలారు. అలానే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ)
తమన్ సంగీతమందించిన 'వారెవ్వా' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ వినడానికి బాగుంది. అఖిల్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.
ఇప్పటివరకు అఖిల్ ఐదు సినిమాలు చేస్తే.. వాటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓకే అనిపించుకుంది. మిగిలినవన్నీ బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొట్టాలి. మరి 'లెనిన్'తో ఏం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?)


