హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఎన్టీఆర్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్.
ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ΄్లాన్ చేశారట దర్శకుడు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్నారని, ఈ దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘డ్రాగన్ ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.


