కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల | Amala Akkineni About Her Parents and Childhood | Sakshi
Sakshi News home page

Amala Akkineni: ఆస్తులన్నీ కోల్పోయాం.. ఇంటిపనంతా మేమే..

Nov 21 2025 12:45 PM | Updated on Nov 21 2025 1:09 PM

Amala Akkineni About Her Parents and Childhood

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగార్జున - అమల (Amala Akkineni) జంటగా నటించిన శివ సినిమా 36 ఏళ్ల తర్వాత రీరిలీజైంది. నవంబర్‌ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్‌ చేశారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న అమల ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఆస్తులు కోల్పోయాం
అమల మాట్లాడుతూ.. అమ్మ ఐరిష్‌, నాన్న బెంగాలి. నాన్న చిన్నతనంలో బెంగాల్‌ విభజన జరిగింది. అప్పుడు మేము ఆస్తులన్నీ కోల్పోయాం. కట్టుబట్టలతో నాన్న రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. బాగా చదువుకుంటేనే పైకొస్తామని ఆలోచించి చదువుపై దృష్టి పెట్టాడు. అలా బాగా చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించాడు. నాన్నకు తొమ్మిది మంది చెల్లెళ్లు, తమ్ముళ్లున్నారు. తను సంపాదించేదంతా వారికే పెట్టేవాడు.

చిన్నతనంలో భరతనాట్యం
అమ్మానాన్న ఇద్దరూ నౌకాదళ అధికారులుగా పనిచేసేవారు. వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు మారుతూ ఉండేవాళ్లం. అలా వైజాగ్‌లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. మా డ్యాన్స్‌ టీచర్‌ అమ్మతో.. మీ కూతురికి మంచి టాలెంట్‌ ఉంది. చెన్నైలోని కళాక్షేత్రలో చేర్పించండి. అక్కడ ఇంకా బాగా నేర్పిస్తారు అని సలహా ఇచ్చింది.

అక్కడే చదువుకున్నా..
అలా నన్ను 9 ఏళ్ల వయసులో కళాక్షేత్ర స్కూల్‌లో చేర్పించారు. 19 ఏళ్లు వచ్చేవరకు అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాను. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నాట్యప్రదర్శనలు ఇచ్చాను. మా ఇంట్లో పనివాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ మేమే చేసుకునేవాళ్లం.  

సినిమాల్లో ఎంట్రీ
దర్శకుడు టి.రాజేందర్‌ తన సినిమా కోసం క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావాలని కళాక్షేత్రకు వచ్చాడు. అలా మైథిలి ఎన్నయి కథలై సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యాను. అది చాలా పెద్ద హిట్టవడంతో సినిమాలు చేసుకుంటూ పోయాను. అత్తమ్మ అక్కినేని అన్నపూర్ణమ్మ దగ్గరే తెలుగు బాగా నేర్చుకున్నాను. తను నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంది. 

తండ్రి మాట జవదాటడు
పిల్లల విషయానికి వస్తే నాగచైతన్య తల్లి చెన్నైలో ఉంటుంది. కాలేజీ విద్య కోసం అతడు హైదరాబాద్‌ వచ్చాడు. అప్పుడే తన గురించి బాగా తెలుసుకున్నాను. చైకి మెచ్యూరిటీ ఎక్కువ. ఎటువంటి తప్పు చేయడు. నాన్న మాట జవదాటడు. చై, అఖిల్‌.. వీళ్లిద్దరినీ సొంత నిర్ణయాలు తీసుకోమని వదిలేశాం. అప్పుడే వాళ్లంతట వాళ్లు అన్నీ తెలుసుకుంటారు. నాకు మంచి కోడళ్లు దొరికారు. వాళ్లు చాలా టాలెండెట్‌. ఇంత మంచి కోడళ్లు దొరకడం నా అదృష్టం అని అమల చెప్పుకొచ్చింది.

చదవండి: ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement