బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది. తనూజ, కల్యాణ్, సుమన్, భరణి, దివ్య, డిమాన్ పవన్, రీతూ, సంజన.. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి వెళ్లారు. చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు. ఈరోజు అతడి తల్లి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది.
ఏడవద్దు డాడీ
ఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది. తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు.. ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది. కమెడియన్‌గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలంది.
తల్లి కోసం పాట
కొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది. చివర్లో ఇమ్మూ.. సువ్విసువ్వాలమ్మా పాట పాడి అందరి మనసులు పిండేశాడు. ఇక ఇమ్మూ తల్లి కొడుక్కి ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూడాలి. అలాగే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.


