బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్ కల్యాణ్, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్ 20వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
కల్యాణ్ తల్లికి తనూజ గిఫ్ట్
ఫ్యామిలీ వీక్ వద్దని బెట్టు చేసిన కల్యాణ్ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్ ఎందుకు స్పెషల్‌గా మా అమ్మకే చీర పెట్టావ్? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్ చూపించావ్, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది.
రీతూ తల్లి ఎంట్రీ
అలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్‌కు బిగ్‌బాస్ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.

మాడిపోయిన పవన్ ముఖం
తనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్ పవన్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్‌లో మాత్రమే ఫోకస్ చేయ్.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది.
దివ్యకి దూరంగా ఉండు
తనూజ-నాన్న బంధం తన ఫేవరెట్ అంది. నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్‌గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్‌లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం..


