తెలంగాణలో 'ది రాజాసాబ్‌' ఫ్యాన్స్‌కు నిరాశ.. | Telangana Govt No Benefit Shows And Ticket Price For The Raja saab | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 'ది రాజాసాబ్‌' ఫ్యాన్స్‌కు నిరాశ..

Jan 8 2026 9:31 PM | Updated on Jan 8 2026 9:35 PM

Telangana Govt No Benefit Shows And Ticket Price For The Raja saab

తెలంగాణలో 'ది రాజా సాబ్‌' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్‌ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ బాధతో థియేటర్స్‌ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ కూడా నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్‌ అభిమానులు భగ్గుమంటున్నారు.

'ది రాజా సాబ్‌' సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్‌ ధరల పెంపునకు ఛాన్స్‌ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్  మొదలు కాలేదు.  కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభాస్‌ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.

కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?
టికెట్‌ ధరల పెంపు కోసం ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది.  టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement