త్వరలో చర్లపల్లి-నాగర్‌కోయల్‌ అమృత్‌ భారత్‌.. ప్రత్యేకత ఇదే.. | New Amrit Bharat Express From Charlapalli To Nagercoil Details | Sakshi
Sakshi News home page

త్వరలో చర్లపల్లి-నాగర్‌కోయల్‌ అమృత్‌ భారత్‌.. ప్రత్యేకత ఇదే..

Mar 7 2026 1:05 PM | Updated on Mar 7 2026 1:13 PM

New Amrit Bharat Express From Charlapalli To Nagercoil Details

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్‌ మీదుగా మరో అమృత్‌భారత్‌ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్‌ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్‌కోయల్‌ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.

జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్‌భారత్‌ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్‌కోయల్‌ అమృత్‌భారత్‌ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్‌ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌ మీదుగా రెండు అమృత్‌భారత్‌ రైళ్లు, వరంగల్‌ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్‌భారత్, హైదరాబాద్‌కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చర్లపల్లి–ముజఫర్‌పూర్‌ జంక్షన్‌(బిహార్‌) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.

కాగా, హైదరాబాద్‌–నాగర్‌కోయిల్‌ అమృత్‌ భారత్‌ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement