గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయిపోయింది.
గుర్రం పాపిరెడ్డి(Gurram Paapi Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న జీ5(Zee5) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు.

గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.


