కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో నవంబర్ 28న హిందీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ రన్ ముగిసిని తర్వాత ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్‌హిట్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ (అమర కావ్యం) మూవీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో ఈ నెల 23న విడుదల కానుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో ధనుష్ బాగా నటించారు. తన కోపం కారణంగా ఎప్పుడూ కాలేజ్‌లో గొడవలు పడుతూ ఉంటాడు. అయితే, కాలేజీ రోజుల్లోనే సాహీ (కృతి సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే, తన కోపం కారణంగా నిజాయితీగా ప్రేమించినప్పటికీ తన ప్రియురాలిని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతను ఏం చేశాడు..? సాహీ జీవితంపై శంకర్ ప్రభావం ఎలా చూపింది..? ఫైనల్‌గా ఈ జోడీ కలిసిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


