
బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) హీరోగా నటించిన మూవీ 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf) డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మే 9న థియేటర్స్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిల వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇందులో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించగా.. ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపింది. ఈ చిత్రాన్ని కరణ్ శర్మ తెరకెక్కించారు. స్త్రీ 2 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్ రావ్ 'భూల్ చుక్ మాఫ్' ద్వారా మరో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. కానీ, అది ఫలించలేదు.
'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారీ ఆశలతో ఈ సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులతో పాటుగా చూడాలని తాము అనుకున్నాం. కానీ, దేశ స్ఫూర్తి, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామంటూ.. జై హింద్ అని ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.

భూల్ చుక్ మాఫ్ మూవీ పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కథ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో ఒక యువకుడు ఎలా నెగ్గాడు. కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అనుకుంటే.. యువతి తండ్రికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. దాని వల్ల మొదలైన ఇబ్బందులు ఏంటి..? అనేది సినిమాలో తెలుసుకోవాలి. ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటలో ధనశ్రీ స్టెప్పులు అదుర్స్ అనేలా ఉంటాయి. క్రికెటర్ చాహల్‌తో విడిపోయాక ఆమె నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది.