హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు | Taapsee Pannu Comments On Some Actors | Sakshi
Sakshi News home page

హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు

Mar 21 2026 6:33 AM | Updated on Mar 21 2026 8:27 AM

Taapsee Pannu Comments On Some Actors

నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్‌ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. 

కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. 

ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్‌ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement