దురంధర్‌-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..! | The auto driver who cant afford to watch Dhurandhar 2 Movie | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్‌-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!

Mar 25 2026 9:14 PM | Updated on Mar 25 2026 9:14 PM

The auto driver who cant afford to watch Dhurandhar 2  Movie

రణ్‌వీర్‌ సింగ్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్‌  నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.

అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్‌వీర్ సింగ్‌ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్‌-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్‌-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా.. రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ ‍సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్‌ హీరోయిన్‌గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement