హీరో రాజ్‌తరుణ్‌ మాజీ లవర్‌ లావణ్య హల్‌చల్‌ | Hero Raj Tarun Ex Girlfriend Lavanya Hulchul | Sakshi
Sakshi News home page

హీరో రాజ్‌తరుణ్‌ మాజీ లవర్‌ లావణ్య హల్‌చల్‌

Mar 25 2026 8:41 PM | Updated on Mar 25 2026 9:01 PM

Hero Raj Tarun Ex Girlfriend Lavanya Hulchul

సాక్షి, సంగారెడ్డి: మద్యం మత్తులో సినీ హీరో రాజ్‌ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్‌చల్‌ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు  చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మల్కాపూర్‌ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును మల్లెపల్లి పోలీసులు అడ్డుకున్నారు.

సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి  చేరుకున్నారు. పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement