కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..! | KD The Devil Movie Director Prem Responds On hindi song controversy | Sakshi
Sakshi News home page

KD The Devil Movie: కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!

Mar 25 2026 9:31 PM | Updated on Mar 25 2026 9:31 PM

KD The Devil Movie Director Prem Responds On hindi song controversy

కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్‌ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్‌ తేరీ సర్కే అనే సాంగ్‌ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా హిందీ లిరిక్స్ వర్షన్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంటనే హిందీ వర్షన్ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

ఈ నేపథ్యంలో హిందీ లిరిక్స్ వివాదానికి దారి తీయడంపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీ భాషపై తనకు పట్టులేదని.. ఆ లిరిక్స్ అర్థం కూడా తనకు తెలియదన్నారు. నేను కన్నడలో మాత్రమే లిరిక్స్‌  రాశానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఒకవైపు యుద్ధం.. మరోవైపు గ్యాస్‌ కొరత ఉందని.. వాటిపై చర్చించాలని అన్నారు. అంతేకానీ ఈ పాటను వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాట కేవలం ఒక పార్టీలో భాగంగా సరదా కోసమే ఉంచామని వెల్లడించారు.  కాగా.. ఈ మూవీలో  నోరా ఫతేహి, సంజయ్‌దత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement