కాంబినేషన్ ఫిక్స్‌ | Mani Ratnam Next Film To Star Vijay Sethupathi and Sai Pallavi | Sakshi
Sakshi News home page

కాంబినేషన్ ఫిక్స్‌

Mar 21 2026 3:51 AM | Updated on Mar 21 2026 3:51 AM

Mani Ratnam Next Film To Star Vijay Sethupathi and Sai Pallavi

విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్  ఫిక్స్‌ అయ్యింది. ఈ ఇద్దరూ జోడీగా నటించనున్న సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నారు. సుభాస్కరన్  సమర్పణలో లైకా   ప్రోడక్షన్స్, మద్రాస్‌ టాకీస్, ఇండియా టాకీస్‌ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఏఆర్‌ రెహమాన్  ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

సోని మ్యూజిక్‌ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను పొందింది. ఇక ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్  చేస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. కాగా, మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘చెక్క చివంద వానమ్‌’లో (తెలుగులో ‘నవాబ్‌’ టైటిల్‌తో విడుదలైంది) విజయ్‌ సేతుపతి ఓ లీడ్‌ రోల్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement