చరణ్‌కు గాయం..'పెద్ది' సంబరాలకు ఆటంకం? | Ram Charan: Special glimpse from Peddi movie are coming | Sakshi
Sakshi News home page

చరణ్‌కు గాయం..'పెద్ది' సంబరాలకు ఆటంకం?

Mar 25 2026 10:58 PM | Updated on Mar 25 2026 11:21 PM

Ram Charan: Special glimpse from Peddi movie are coming

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్‌ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్‌డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్‌మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది.  

ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్‌ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 

అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్‌ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement