చండీగఢ్‌లో జైలర్‌ | Rajinikanth and Shah Rukh Khan Jailer 2 action sequence to be filmed at this massive Chandigarh factory | Sakshi
Sakshi News home page

చండీగఢ్‌లో జైలర్‌

Mar 21 2026 3:45 AM | Updated on Mar 21 2026 3:45 AM

Rajinikanth and Shah Rukh Khan Jailer 2 action sequence to be filmed at this massive Chandigarh factory

చండీగఢ్‌లో ల్యాండ్‌ అయ్యారట ముత్తువేల్‌ పాండ్యన్ . రజనీకాంత్‌ హీరోగా నెల్సన్  దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్‌ 2’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్‌జే సూర్య, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్  చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌గా నటిస్తున్నారు రజనీకాంత్‌.

ఇందులోని మరో కీలకమైన పోలీస్‌ పాత్రలో హీరో షారుక్‌ఖాన్  నటించనున్నారని సమాచారం. ‘జైలర్‌ 2’ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రస్తుతం చండీగఢ్‌లో జరుగుతోందని కోలీవుడ్‌ టాక్‌. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, షారుక్‌ఖాన్ లపై ఓ యాక్షన్  సీక్వెన్స్ను తీస్తున్నారట నెల్సన్  అండ్‌ టీమ్‌. కార్‌ క్రషింగ్‌ ఫ్యాక్టరీలో ఈ యాక్షన్  సీక్వెన్స్ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో ‘జైలర్‌ 2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందని సమాచారం. సన్ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement