
రంజీ ట్రోఫీ విజేత విదర్భ, రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India) మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఇరానీ కప్ (Irani Cup 2025) రసవత్తరంగా సాగుతోంది. 361 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా... శనివారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.
అభిమన్యు ఈశ్వరన్ (17), ఆర్యాన్ జుయల్ (6) అవుట్ కాగా... ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 5 బ్యాటింగ్), కెప్టెన్ రజత్ పాటీదార్ ( Rajat Patidar- 22 బంతుల్లో 2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
విజయానికి 331 పరుగుల దూరంలో..
చేతిలో 8 వికెట్లు ఉన్న రెస్టాఫ్ ఇండియా... విజయానికి ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన రెస్టాఫ్ ఇండియా బ్యాటర్లు... మరి చివరి రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యశ్ ధుల్, మానవ్ సుతార్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. విదర్భ బౌలర్లలో హర్శ్ దూబే, ఆదిత్య ఠాకరే చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 96/2తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... చివరకు 94.1 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 128 పరుగులతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 361 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అయింది. అమన్ (37), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (125 బంతుల్లో 36; 4 ఫోర్లు), దర్శన్ నల్కండే (92 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.
అన్షుల్ కంబోజ్‌కు 4 వికెట్లు
తొలి ఇన్నింగ్స్‌లో మంచి పోరాటం కనబర్చిన విదర్భ ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో అదే జోరు కొనసాగించలేకపోయారు. మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో విదర్భ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
ఇక హర్శ్ దూబే (43 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. రెస్టాప్ ఇండియా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 4 వికెట్లు పడగొట్టాడు.నేడు (అక్టోబరు 5) ఆటకు చివరి రోజు.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 342
రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 214
విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ మోఖడే (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్‌నూర్ బ్రార్ 37; ధ్రువ్ షొరే (ఎల్బీ) (బి) అన్షుల్ కంబోజ్ 27; దానిశ్ మాలేవార్ (సి) రుతురాజ్ (బి)అన్షుల్ కంబోజ్ 16; యశ్ రాథోడ్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 5; అక్షయ్ వాడ్కర్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 36; హర్శ్ దూబే (సి) సారాంశ్ (బి) గుర్‌నూర్ బ్రార్ 29; పార్థ్ రేఖడే (సి) రజత్ పాటీదార్ (బి) సారాంశ్ 2; యశ్ ఠాకూర్ (సి) ఆర్యాన్ జుయల్ (బి) మానవ్ సుతార్ 13; ఆదిత్య ఠాకరే (నాటౌట్) 3;
ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (94.1 ఓవర్లలో ఆలౌట్) 232.
వికెట్ల పతనం: 1–42, 2–64, 3–97, 4–104, 5–105, 6–144, 7–155, 8–190, 9–207, 10–232. బౌలింగ్: సారాంశ్ జైన్ 21.1–0–52–2; ఆకాశ్‌దీప్ 10–4–13–0; మానవ్ సుతార్ 33–9–82–2; అన్షుల్ కంబోజ్ 12–1–34–4; గుర్‌నూర్ బ్రార్ 18–5–41–2.
రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (ఎల్బీ) (బి) హర్శ్ దూబే 17; ఆర్యాన్ జుయల్ (బి) ఆదిత్య 6; ఇషాన్ కిషన్ (బ్యాటింగ్) 5; రజత్ పాటీదార్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (12 ఓవర్లలో 2 వికెట్లకు) 30. వికెట్ల పతనం: 1–16, 2–24; బౌలింగ్: హర్శ్ దూబే 6–2–20–1; ఆదిత్య ఠాకరే 5–1–8–1; పార్థ్ రేఖడే 1–0–2–0.
చదవండి: అందుకే రోహిత్ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్