
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025-26) తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్న పాటిదార్.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
పాటిదార్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది 16వ సెంచరీ. దేశవాలీ క్రికెట్‌లో పాటిదార్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతను 3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు చేశాడు. ఆ స్కోర్లు ఇలా ఉన్నాయి. 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 125(96)
పంజాబ్‌తో మ్యాచ్‌లో పాటిదార్ వెంకటేశ్ అయ్యర్‌తో (73) కలిసి ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. 92 ఓవర్ల తర్వాత (రెండో రోజు) మధ్యప్రదేశ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 304 పరుగులుగా ఉంది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 72 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది
పాటిదార్‌తో పాటు సరాన్ష్ జైన్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో హిమాన్షు మంత్రి (40), శుభమ్ శర్మకు (41) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 232 పరుగులకు ఆలౌటైంది. సరాన్ష్ జైన్ 6 వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. కుమార్ కార్తికేయ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఉదయ్ సహరన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. విధ్వంసకర ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
చదవండి: విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!