breaking news
Kumar Kartikeya
-
సారాంశ్‌కు ఐదు.. కార్తికేయకు నాలుగు.. చహర్ విఫలమైనా..
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్‌జోన్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. వికెట్ నష్టపోకుండా 50 పరుగులుసెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్‌కు విలవిల... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్‌ను తట్టుకోలేక సౌత్‌జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీపక్ చహర్ విఫలంసెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు. మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్‌తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149. బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0. -
చేతులేత్తేసిన బ్యాటర్లు.. 149 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైనల్లో జగదీశన్ భారీ సెంచరీతో కదం తొక్కగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బ్యాటింగ్‌లో విఫలమైన సౌత్ జోన్ కనీసం బౌలింగ్‌లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
Madhya Pradesh vs Chandigarh: చండీఘడ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ కుమార్ కార్తికేయ అదరగొట్టాడు. ఏకంగా పది వికెట్లు కూల్చి జట్టుకు భారీ విజయం అందించాడు. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో చండీఘడ్‌పై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మీద 125 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ డిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఇండోర్ వేదికగా డిసెంబరు 20న టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశ్ దూబే(44) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పాటిదార్ 88 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో అక్షత్ రఘువంశీ 77 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో 309 పరుగులకు మధ్యప్రదేశ్ ఆలౌట్ అయింది. విలవిల్లాడిన చండీఘడ్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్‌కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ అర్స్లాన్ ఖాన్ 34 పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్ల స్కోర్లు వరుసగా 1, 0, 1, 0, 4, 0, 1, 11(నాటౌట్), 0, 0. చైనామన్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 6 వికెట్లు కూల్చగా.. సారాంశ్ జైన్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీయగా.. అనుభవ్ అగర్వాల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బౌలర్లు చెలరేగడంతో చండీఘడ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారీ ఆధిక్యంలో ఉన్న మధ్యప్రదేశ్.. చండీఘడ్ను ఫాలో ఆన్ ఆడించగా 127 పరుగులకే కథ ముగిసిపోయింది. ఈసారి సారాంశ్ జైన్ 5 వికెట్లు పడగొట్టగా.. కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశాడు. ఆవేశ్‌కు ఒక వికెట్ దక్కింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 10 వికెట్లతో చెలరేగిన కుమార్ కార్తికేయ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! -
9 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! భావోద్వేగంతో..
Mumbai Indians -Kumar Kartikeya: అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కష్టాల కడలిని ఈదాల్సి వచ్చినా వెనకడుగు వేయక ముందుకు సాగేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ కూడా ఒకడు. క్రికెటర్ కావాలన్న తన ఆశయం కుటుంబానికి భారం కావొద్దనే తలంపుతో 15 ఏళ్ల వయస్సులో ఇంటిని వీడాడు. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను వీడి ఢిల్లీ చేరుకున్నాడు. కష్టనష్టాలకోర్చి.. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. పగలంతా పనిచేసుకుని.. ఏడాదిపాటు కేవలం రాత్రిపూట భోజనంతో సరిపెట్టుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. కఠిన శ్రమ, ప్రతిభకు తోడు కాలం కలిసి రావడంతో 2018లో మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. తన ఆట తీరుతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్రంలోనే.. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న కార్తికేయ ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఐదు వికెట్లతో మెరిసి.. ఇక ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల కుమార్ కార్తికేయ.. ఫైనల్లో 5 వికెట్లతో రాణించాడు. తద్వారా మధ్యప్రదేశ్ తొలిసారిగా రంజీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా తన కలలను సాకారం చేసుకుంటున్న కార్తికేయ తొమ్మిదేళ్ల తర్వాత తాజాగా తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు. ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘తొమ్మిదేళ్ల 3 నెలల తర్వాత నా కుటుంబాన్ని.. మా అమ్మను కలిశాను. ఈ అనుభూతిని వర్ణించడానికి, నా మనసులోని భావనలు తెలిపేందుకు మాటలు రావడం లేదు’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోను కార్తికేయ షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్రికెటర్ కావాలన్న లక్ష్యం కోసం కార్తికేయ చేసిన త్యాగాన్ని కొందరు కొనియాడుతుంటే.. తల్లిదండ్రులను కలుసుకోవడానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. చదవండి: ICC T20 Rankings: బాబర్ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
'నా తొలి మ్యాచ్‌ను మా నాన్న ప్రొజెక్టర్‌లో చూశారు'
ఐపీఎల్-2022 సీజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఇండియన్స్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరగేంట్రం చేసిన కార్తికేయ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ సాధించాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. అదే విధంగా గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కాగా తాజాగా ముంబై ఇండియన్స్ పోస్ట్ చేసిన వీడియోలో కార్తికేయ పలు విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్లో తొలి వికెట్ పడగొట్టగానే తన తండ్రి శ్యామ్ మత్ సింగ్ ఎలా సెలబ్రేషన్స్ జరుపుకున్నాడో కార్తికేయ వెల్లడించాడు. "నేను రాజస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతున్నాని మా నాన్నకు చెప్పాను. అతడు తన మొత్తం పోలీస్ బెటాలియన్‌కి ఈ విషయం చెప్పాడు. వారు అంతా ప్రొజెక్టర్‌ను అమర్చుకుని మ్యాచ్‌ను చూశారు. నేను నా మొదటి వికెట్ సాధించగానే, అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. మా నాన్నను అందరూ కౌగిలించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆ వీడియోను నాకు మా నాన్న షేర్ చేశారు. ఆ వీడియో చూడగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందకంటే నా కెరీర్ ఆరంభం నుంచి అతడు నాకు ఎంతో మద్దతుగా ఉన్నారు" అని కుమార్ కార్తికేయ పేర్కొన్నాడు. చదవండి: Sunil Gavaskar: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. భారత జట్టులోకి తిరిగి వస్తాడు'