
దులీప్ ట్రోఫీ-2025లో తలపడే సెంట్రల్ జోన్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, యూపీ స్టార్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ 15 మంది సభ్యుల జట్టులో అంతర్జాతీయ క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, దీపక్ చాహర్, రజిత్ పాటిదార్ ఉన్నారు.
కాగా ఈ జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నప్పటికి ఈ టోర్నీలో ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. టోర్నీ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. లేదంటే ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.
ఒకవేళ అతడు ఫిట్‌గా ఉంటే జురెల్ స్ధానంలో కెప్టెన్‌గా ఎంపికయ్యే వాడు. ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించిన పాటిదార్.. గత రంజీ సీజన్‌లో దమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్‌లలో 48 సగటుతో 529 పరుగులు చేశాడు. మరోవైపు జురెల్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
పంత్ స్ధానంలో..
అయితే ధ్రువ్ జురెల్ ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని సమం చేసిన భారత జట్టు భాగంగా ఉన్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కు పరిమితమైన జురెల్.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో మాత్రం ఆడాడు. రిషబ్ పంత్ గాయపడడంతో జురెల్‌కు ఛాన్స్ లభించింది. ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేసి జురెల్ పర్వాలేదన్పించాడు.
వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. నార్త్ జోన్ కెప్టెన్‌గా టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఈ దేశవాళీ టోర్నీ ఆగస్టు 28న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడనుంది.
సెంట్రల్ జోన్ జట్టు ఇదే: ధ్రువ్ జురెల్(కెప్టెన్), రజత్ పాటిదార్*, ఆర్యన్ జుయల్, డానిష్ మలేవార్, సంచిత్ దేశాయ్, కుల్దీప్ యాదవ్, ఆదిత్య ఠాకరే, దీపక్ చాహర్, సరాంశ్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, మానవ్ సుత్మేద్, మానవ్ సుత్మేద్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మాధవ్ కౌశిక్, యశ్ ఠాకూర్, యువరాజ్ చౌదరి, మహిపాల్ లోమ్రోర్, కుల్దీప్ సేన్, ఉపేంద్ర యాదవ్.