ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ సింగిల్స్ విభాగంలో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా), క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) విజేతలుగా నిలిచారు. చైనాలోని హాంగ్జౌలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. 96 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ 21–13, 18–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)పై గెలిచింది.
ఈ ఏడాది ఆన్ సె యంగ్‌కిది 11వ టైటిల్ కావడం విశేషం. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ 8వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ 21–19, 21–9తో ప్రపంచ నంబర్‌వన్ షి యు కి (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా వరల్డ్ టూర్ ఫైనల్స్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన తొలి ఫ్రాన్స్ ప్లేయర్‌గా పొపోవ్ చరిత్ర సృష్టించాడు.
ఈ టైటిల్ గెలిచే క్రమంలో పొపోవ్ ప్రపంచ 2వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్), ప్రపంచ 3వ ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 5వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)లను ఓడించడం విశేషం.
విజేతలుగా నిలిచిన ఆన్ సె యంగ్, క్రిస్టో పొపోవ్‌లకు 2,40,000 డాలర్ల (రూ. 2 కోట్ల 14 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.


