విజయ్ హజారే ట్రోఫీ బరిలో ఆంధ్ర జట్టు
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్ర జట్టుకు భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సారథ్యం వహిస్తాడు. ఆంధ్ర జట్టు తమ మ్యాచ్‌లను బెంగళూరులో ఆడుతుంది. గ్రూప్ ‘డి’లో ఢిల్లీ, రైల్వేస్, ఒడిశా, సౌరాష్ట్ర, గుజరాత్, హరియాణా, సర్వీసెస్ జట్లతో ఆంధ్ర తలపడుతుంది. ఈనెల 24న తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో ఆంధ్ర ‘ఢీ’కొంటుంది.
ఆంధ్ర వన్డే జట్టు: నితీశ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), రికీ భుయ్, కోన శ్రీకర్ భరత్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్, వై.సందీప్, ఎం.ధనుశ్, సౌరభ్ కుమార్, బి.వినయ్ కుమార్, టి.వినయ్, చీపురుపల్లి స్టీఫెన్, పీవీ సత్యనారాయణ రాజు, కేఎస్‌ఎన్ రాజు, జె.సాకేత్ రామ్, సీఆర్ జ్ఞానేశ్వర్, సీహెచ్ సందీప్.


