ఈ నెల 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రాహుల్ బుద్ధిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈనెల 24 నుంచి జనవరి 18వ తేదీ వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ దేశంలోని నాలుగు నగరాల్లో (బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్) జరుగుతుంది.
హైదరాబాద్ జట్టు తమ మ్యాచ్‌లను రాజ్‌కోట్‌లో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో జమ్మూ కశీ్మర్, విదర్భ, బెంగాల్, బరోడా, అస్సాం, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ జట్లతో హైదరాబాద్ తలపడుతుంది. ఈనెల 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ను హైదరాబాద్ ‘ఢీ’ కొంటుంది.
హైదరాబాద్ వన్డే జట్టు:
జి.రాహుల్ సింగ్ (కెప్టెన్), రాహుల్ బుద్ధి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, పేరాల అమన్ రావు, ఎం.అభిరథ్ రెడ్డి, కె.నితేశ్ రెడ్డి, ఎ.వరుణ్ గౌడ్, ఎం.సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), ఎ.ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), ఎన్.నితిన్ సాయి యాదవ్, సి.రక్షణ్ రెడ్డి, కార్తికేయ కక్, ఇల్యాన్ సథాని, మొహమ్మద్ అర్ఫాజ్. స్టాండ్ బై: పి.నితీశ్ రెడ్డి, కె.హిమతేజ, అనికేత్ రెడ్డి, రాహుల్ రాదేశ్, పున్నయ్య. వినోద్ కుమార్ (మేనేజర్), డీబీ రవితేజ (హెడ్ కోచ్), అభిజిత్ చటర్జీ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రంజిత్ కుమార్ (ట్రెయినర్), సంతోష్ కందుకూరి (ఫిజియో), కృష్ణా రెడ్డి (ఎనలిస్ట్).


