ఆఫీస్‌ మార్కెట్‌కు  అడ్డా.. హైదరాబాద్‌  | Hyderabad office market is entering its next growth phase | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ మార్కెట్‌కు  అడ్డా.. హైదరాబాద్‌ 

Feb 6 2026 4:00 AM | Updated on Feb 6 2026 4:00 AM

Hyderabad office market is entering its next growth phase

ఏటేటా పెరుగుతున్న డిమాండ్‌ 

కొత్తగా 19 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ వసతులు 

ఏడాది కాలంలో అందుబాటులోకి 

వీటిల్లో పావు వంతుకు ఇప్పటికే లీజు  

ఇక్రా నివేదిక వెల్లడి

హైదరాబాద్‌: ఆఫీస్‌ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్‌ మారుతోంది. స్థిరమైన డిమాండ్, ఆఫీస్‌ వసతుల ఖాళీలు తగ్గుతుండడం, అద్దె ధరల్లో స్థిరమైన పెరుగుదులతో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టినట్టు రేటింగ్‌ సంస్థ ఇక్రా తెలిపింది. 2025–26లో చివరి త్రైమాసికం (2026 జనవరి–మార్చి) నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా 18–19 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇందులో పావు వంతు (23 శాతం) వసతులకు లీజింగ్‌ ఒప్పందాలు ఇప్పటికే కుదిరినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల్లోనూ హైదరాబాద్‌ ఆఫీస్‌ వసతుల పట్ల కిరాయిదారుల్లో స్థిరమైన విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా పేర్కొంది.  

లీజింగ్‌ భళా.. 
2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆఫీస్‌ వసతుల మార్కెట్‌ బలమైన పనితీరు చూపించింది. ఈ కాలంలో హైదరాబాద్‌ మార్కెట్లో 8.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ గ్రేడ్‌–ఏ స్పేస్‌ అదనంగా అందుబాటులోకి వచి్చంది. ఇక ఆఫీస్‌ వసతుల నికర స్వీకరణ 8.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ఐటీ–బీపీఎం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) సంస్థల నుంచి డిమాండ్‌ నెలకొంది. దీంతో 2025 డిసెంబర్‌ నాటికి ఖాళీ వసతులు 17 శాతానికి తగ్గాయి. 2024 మార్చి నాటికి ఖాళీలు 18.2 శాతంగా ఉండడం గమనార్హం. కొత్త వసతులు అందుబాటులోకి వచి్చనా కానీ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ మూలాలు బలంగా ఉన్నట్టు, వసతుల భర్తీ రేటు 2027 మార్చి నాటికి 82.5–83 శాతానికి పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది.  

ఆఫీస్‌ మార్కెట్లో కింగ్‌.. 
దేశవ్యాప్తంగా టాప్‌–6 నగరాల్లోని గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతుల్లో హైదరాబాద్‌ మార్కెట్‌ గత ఐదేళ్లలో వేగవంతమైన విస్తరణ చూసినట్టు ఇక్రా నివేదిక ఆధారంగా తెలుస్తోంది. పోటీ మార్కెట్లలో వసతులు ఏటా 7 శాతం మేర పెరిగితే, హైదరాబాద్‌లో 14 శాతం అధికమవుతూ వచ్చాయి. టాప్‌–6 నగరాల్లోని వసతుల్లో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వాటా 2021 మార్చి నాటికి 13 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్‌ నాటికి 16 శాతానికి చేరింది. హైటెక్‌ సిటీ/మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతాల్లోని ఆఫీస్‌ వసతులు నగరంలోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ సరఫరాలో 63 శాతం వాటా కలిగి, సరఫరాకు కీలకంగా ఉన్నాయి.

 హైటెక్‌ సిటీలో 2026–27లో పరిమిత సరఫరానే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఖాళీలు తక్కువగానే ఉండొచ్చని.. అయితే గచి్చ»ౌలి, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో ఖాళీలు స్థిరంగా ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. లీజు ధరలు క్రమంగా పెరుగుతున్నాయంటూ, ఈ మూడు సూక్ష్మ మార్కెట్లలో గత ఐదేళ్లలో ఏటా 3–4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని ఇక్రా నివేదిక వెల్లడించింది. 2025–26 క్యూ4 నుంచి 2026–27 వరకు ఇదే స్థాయిలో లీజు ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్, బలమైన లీజింగ్‌ కార్యకలాపాలు మధ్య కాలానికి హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement