source: X
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఊరట లభించింది. గాయం కారణంగా తొలుత జట్టులో చోటు దక్కని స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్, కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.
జూలై 26న ప్రకటించిన బంగ్లాదేశ్ తొలి 15 మంది సభ్యుల జట్టులో లిట్టన్ దాస్‌కు చోటు దక్కలేదు. ఎడమ కాలి కాఫ్ మసిల్‌కు గ్రేడ్-1 గాయం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి.
అయితే పునరావాస ప్రక్రియలో లిట్టన్ వేగంగా కోలుకున్నాడు. అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తొలి టెస్టుకు అతడిని జట్టులోకి చేర్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 13న డార్విన్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ మెక్‌కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి మొదలవుతోంది. టెస్ట్ మ్యాచ్‌లకు ముందు ఆగస్ట్ 6-8 వరకు బంగ్లాదేశ్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగనుంది.
2003 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడబోతుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.


