source: X
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఇటీవలి కాలంలో మెహిదీ హసన్ మిరాజ్ సారథ్యంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వంలో మార్పు చేయాలని బోర్డు నిర్ణయించింది.
లిట్టన్ దాస్‌కు నాయకత్వ అనుభవం కూడా బాగానే ఉంది. గతంలో బంగ్లాదేశ్ వన్డే జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన, 2021 నుంచి 2026 వరకు టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక టెస్టులో కూడా జట్టును నడిపించాడు.
ఈ ఏడాది డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే వన్డే సిరీస్ నుంచి లిట్టన్ దాస్ అధికారికంగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దాస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహించనుండగా.. నజ్ముల్ హసన్ షాంటో టెస్ట్ జట్టు సారధిగా ఉన్నాడు.
బంగ్లాదేశ్ తాజాగా జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆగస్ట్‌లో ఈ జట్టు ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.


