breaking news
Australia vs Bangladesh
-
ఆసీస్ తుది జట్టు ప్రకటన.. మూడేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ ఎంట్రీ
మెకే వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్ డిసైడర్ రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేలవ ఫామ్‌తో సతమవుతున్న జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తిరిగి మాట్ రెన్షాకు పిలుపునిచ్చారు.2023 మళ్లీ ఆసీస్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రెన్షా.. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. అయితే వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు ఆసీస్ మేనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా అతడు రాణించకపోతే ఆసీస్ టెస్టు జట్టులో చోటు కోల్పోయే ఛాన్స్ ఇచ్చింది.అయితే రెండో టెస్టుకు స్పిన్నర్ నాథన్ లియోన్‌ను పక్కన పెట్టి పేసర్ స్కాట్ బోలాండ్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆసీస్ మేనెజ్మెంట్ నాథన్ లియోన్వైపే ముగ్గు చూపింది. దీంతో బోలాండ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మెకే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. ఆగస్టు 22 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా తుది జట్టు : మ్యాట్ రెన్షా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), బో వెబ్‌స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గిల్ సహచరుడు -
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ జేక్ వెదర్లాండ్పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్‌ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జయభేరి మోగించింది. ఆ ఇద్దరూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లోనే వెదర్లాండ్ అవుటయ్యాడు.ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు.లబుషేన్‌కు మరో అవకాశంకాగా 2023లో చివరిగా ఆసీస్ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్ హెడ్‌తో కలిసి ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. మార్నస్ లబుషేన్ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌ను కూడా తప్పించాలనే డిమాండ్లు రాగా.. యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశం ఇచ్చింది. ఇక ఆసీస్- బంగ్లా మధ్య ఆగష్టు 22- 26 మధ్య రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు మెకాయ్ వేదిక.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మ్యాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి -
ఆసీస్‌పై బంగ్లాదేశ్ గెలవడం ఇంగ్లండ్ చావుకొచ్చింది..!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించడం ఇంగ్లండ్ క్రికెట్ చావుకొచ్చినట్లైంది. గెలిచింది బంగ్లాదేశ్, ఓడింది ఆస్ట్రేలియా అయితే ఓ చిన్నదేశం మాత్రం ఇంగ్లండ్ క్రికెట్‌ను టార్గెట్ చేసింది. ఐస్లాండ్ అనే దేశానికి చెందిన క్రికెట్ బోర్డు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ సాధించినన్ని టెస్ట్ విజయాలే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సాధించిందని పేర్కొంది. ఈ వ్యంగ్యమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.క్రికెట్ అభిమానులు ఈ విషయం నిజమే కదా అని చర్చించుకుంటున్నారు. గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ 20 టెస్టులు ఆడి ఒక్కటే విజయం సాధిస్తే.. బంగ్లాదేశ్ మాత్రం 23 ఏళ్ల తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆసీస్‌ను మట్టికరిపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్ని వనరులు ఉండి.. ఘనమైన చరిత్ర కలిగిన ఇంగ్లండ్ కంటే కనీస సౌకర్యాలు కూడా లేని పసికూన బంగ్లాదేశ్ చాలా మెరుగని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్‌పై ఐస్లాండ్ క్రికెట్ వేసిన సెటైర్ అభిమానులను ఆకట్టుకుంది. పనిలోపనిగా కొందరు అభిమానులు పాకిస్తాన్, శ్రీలంక జట్లపై కూడా కౌంటర్లు వేస్తున్నారు. వీటి కంటే కూడా బంగ్లాదేశ్ చాలా బెటర్ అని కీర్తిస్తున్నారు.కాగా, డార్విన్ వేదికగా నిన్న ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, అనంతరం 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 284 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు సునాయాసంగా ఛేదించి చారిత్రక విజయం సొంతం చేసుకుంది. రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి ప్రారంభమవుతుంది. -
AUS vs BAN: ఓపెనర్‌గా అతడు ఎందుకు?: ఆసీస్ దిగ్గజం ఫైర్
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కంగారూ జట్టు.. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించగా.. సమిష్టి వైఫల్యంతో కమిన్స్ బృందం విమర్శల పాలైంది.టాప్-3 ప్లేయర్లను మారిస్తేనేఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందన్నాడు. ముఖ్యంగా టాప్-3 ప్లేయర్లను మారిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలరని పేర్కొన్నాడు. ఈ మేరకు చానెల్ 7తో మాట్లాడుతూ..హెడ్ ఓపెనర్‌గా ఎందుకు?‘‘టెస్టుల్లో ట్రవిస్ హెడ్‌కు ఓపెనింగ్ స్థానం బెస్ట్ పొజిషన్ కానేకాదు. ఇప్పటికీ అతడు ఐదో నంబర్‌లోనే అత్యుత్తమంగా రాణించగలడని నేను నమ్ముతున్నా. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు.ప్రస్తుత తుదిజట్టు కూర్పు వల్లే బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. నిజానికి ఆస్ట్రేలియా క్రికెట్ అత్యంత శక్తిమంతమైనది. కానీ ఇప్పుడు ఆ స్థానం గల్లంతు అయిపోతుందేమోనని భయంగా ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.లబుషేన్ ఇంకా జట్టులో అవసరమా?మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో చెత్తగా ఆడుతున్నాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు. సామ్ కొన్‌స్టాస్ వంటి వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు?.. టాపార్డర్‌లో మ్యాట్ రెన్షా వంటి వాళ్లకు అవకాశం ఇచ్చి చూడాలి. జేక్ వెదర్లాండ్, లబుషేన్‌లను జట్టు నుంచి తొలగించినా పర్లేదు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న వాళ్లకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలి’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కమిన్స్ కెప్టెన్సీ సరిగ్గా లేదని విమర్శించాడు.టాపార్డర్ విఫలండార్విన్ వేదికగా తొలి టెస్టులో ఆసీస్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23) కాస్త ఫర్వాలేదనిపించినా.. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 17, లబుషేన్ 31 పరుగులు చేయగా.. వెదర్లాండ్ డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. హెడ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఒకే విధంగా బౌల్డ్కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడగా.. ఇది రెండో విజయం. అంతకుముందు సొంతగడ్డపై 2017లో మిర్పూర్లో ఆసీస్‌పై బంగ్లా గెలుపొందింది.చదవండి: పంత్ వల్ల కాలేదు.. బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం -
అస్సలు ఊహించలేదు.. ఇది అత్యంత అవమానకరం: పాంటింగ్
ఆస్ట్రేలియాకు వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు దారుణమైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర ఓటమిని మూట కట్టుకుంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మార్క్ వా తీవ్రంగా స్పందించారు. డార్విన్ టెస్ట్‌కు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఈ సీనియర్ ద్వయం కమ్మిన్స్ సేనపై విమర్శలు వర్షం గుప్పించారు. ఆసీస్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమని మండిపడ్డారు.ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలాంటి ఘోర ఓటమిని నేను ఇప్పటివరకు చూడలేదు. మూడేళ్ల క్రితం గబ్బాలో వెస్టిండీస్ చేతిలో కూడా ఖంగుతిన్నారు. కానీ ఇది అంతకంటే దారుణమైన ఓటమి. ఎందుకంటే బంగ్లా జట్టులో వారి అత్యుత్తమ బౌలర్లు నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం లేరు. అయినప్పటికి మన బ్యాటర్లు చేతులెత్తేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకుంటే బంగ్లాకు ఇది చాలా పెద్ద విజయమని మార్క్ వా పేర్కొన్నారు.ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. ఇది అత్యంత అవమానకరమైన ఓటమి. జట్టులో మార్పులు చేయడానికి నేను సాధారణంగా ఇష్టపడను. కానీ జట్టు తీవ్రంగా విఫలమైనప్పుడు మార్పులు తప్పవు. జట్టును పునర్నిర్మించడానికి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా కొత్త ఓపెనర్, మూడో స్ధానానికి సరిపోయే యంగ్ ప్లేయర్లను తీసుకురావాలి అని పాంటింగ్ సూచించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. -
మా క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం: బంగ్లా కెప్టెన్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు ఫార్మాట్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌ను బంగ్లా జట్టు నాలుగు రోజుల్లోనే ముగించింది. ఈ డార్విన్ టెస్ట్‌లో పర్యాటక బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత కంగారుల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం యువ ఓపెనర్ తంజిద్ హసన్ (101) అద్భుత సెంచరీతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో షాంటో సేన 228 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. 228 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ప్రత్యర్ధి జట్టుకు కేవలం 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో స్పందించాడు. తమ దేశ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప విజయమని షాంటో చెప్పుకొచ్చాడు."మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు ఎన్నో గొప్ప విజయాలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో అయితే ఇప్పటివరకు మేము సాధించిన వాటిలో ఇదే అతి పెద్ద విజయం. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఈ మ్యాచ్ అసాంతం మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. మ్యాచ్‌ను ఆఖరి రోజు వరకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా బరిలోకి దిగాము. ప్రతీ సెషన్లోనూ పోరాడాలి అనుకున్నాము. మా ప్రణాళికలకు తగ్గట్టు మొదటి రోజు నుంచే మేము వారిపై పై చేయి సాధించాం. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో షాంటో పేర్కొన్నాడు.చదవండి: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.🔴BIG REALITY CHECK FOR PAT CUMMINS & AUSTRALIA 🤯Before Bangladesh test series:Cummins🎙️: Some of our guys are saying no to half-a-million pounds for 20 days' work to go and play those two Test matches against Bangladesh.🙄After such a confident statement from Pat,… pic.twitter.com/iS79Cmc6tr— Sam (@cricsam02) August 16, 2026🔴PAT CUMMINS BLAMES THE PITCH FOR AUSTRALIA’S LOSS 🤯Cummins🎙️: The pitch was rock hard with a bit of grass, so we thought the first hour might be tough. But after that, it felt like a pretty good batting track.We expected it to crack up in the heat and spin on Days 4 and 5,… pic.twitter.com/BJmiDYGe2L— Sam (@cricsam02) August 16, 2026Read: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో తంజిద్, నజ్ముల్‌తో పాటు మెహదీ హసన్ కూడా రాణించాడు. బ్యాట్‌తో మెరిసిన మెహదీ హసన్ ఈసారి బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మెహదీ హసన్ విజయంలో తన వంతు పాత్రను సమర్ధంగా పోషించాడు.ఈ నేపథ్యంలోనే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మెహదీ హసన్ వేసిన ఒక అద్భుత బంతికి వెబ్‌స్టర్ బిత్తరపోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. వెబ్‌స్టర్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, మెహిదీ హసన్ మీరాజ్ తన ఆఫ్ స్పిన్‌తో ఆఫ్ స్టంప్ వద్దకు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతిని విసిరాడు, బంతి పిచ్ అయి వెంటనే నిటారుగా వికెట్ల వైపు దూసుకొచ్చింది.బ్యూ వెబ్‌స్టర్ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లైన్ అండ్ లెంగ్త్ ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో వెబ్‌స్టర్ ఆశ్చర్యపోయాడు. ఇక తన అద్భుత బంతితో వికెట్ పడగొట్టిన సంతోషంలో మెహదీ హసన్ సంబరాలు షురూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మూడో బౌలర్‌గా రికార్డుఇక మ్యాచ్‌లో మెహదీ హసన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మూడో బంగ్లా బౌలర్‌గా మెహదీ హసన్ నిలిచాడు. 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహ్ముద్ (6/55), మొహమ్మద్ రఫీఖ్ (5/62) తొలి రెండు స్థానాల్లో నిలిచారు."Hellooooooooooooooooooo" - Kerry O'Keeffe enjoyed that beauty! #AUSvBAN pic.twitter.com/c6lvDgwe2P— cricket.com.au (@cricketcomau) August 16, 2026Read: లైవ్ మ్యాచ్‌లో వాంతి చేసుకున్న జకోవిచ్.. షాక్‌లో ఫ్యాన్స్! -
టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ రేటింగ్ పాయింట్లను పెంచుకోవడమే కాకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను భారీగా దెబ్బేసింది. ఆసీస్‌పై బంగ్లా గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం (PCT) 58.33 నుంచి 66.67కి పెరిగింది. దీంతో ఆ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఆస్ట్రేలియా PCT 87.50 నుంచి 77.78కి పడిపోయింది. అయినప్పటికీ ఆసీస్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 75%, న్యూజిలాండ్ 72.22%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐదో స్థానంలో భారత్aఆసీస్‌పై బంగ్లాదేశ్ విజయం భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియా 48.15% PCTతో ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇప్పుడు గణనీయమైన అంతరం ఏర్పడింది.భారత్ WTC ఫైనల్‌కు చేరాలంటే ఇకపై మిగిలిన టెస్టుల్లో వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఫలితాలు కూడా భారత అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి.ఆస్ట్రేలియాకు బిగ్ షాక్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి, ఆ దేశ గడ్డపై తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, అనంతరం 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 284 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు సునాయాసంగా ఛేదించి చారిత్రక విజయం సొంతం చేసుకుంది.ఫైనల్ ఆశలుచారిత్రక విజయం తర్వాత బంగ్లాదేశ్ WTC ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా మారింది. ఆ జట్టుకు ఈ సైకిల్లో ఇంకా ఆస్ట్రేలియాతో మరో టెస్టుతో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో వీలైనన్ని గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్‌తో రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి ప్రారంభమవుతుంది. -
31 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లోనే ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.9 వికెట్లతో విజయం: వికెట్ల పరంగా బంగ్లాదేశ్‌కు ఇది రెండో అతిపెద్ద టెస్టు విజయం. 2024లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.2- బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇది రెండో విజయం. గతంలో 2017 మీర్పూర్ టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది. ఆసీస్ గడ్డపై మాత్రం బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. అంతేకాదు ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించడం కూడా ఇదే మొదటిసారి. కాగా ఆసీస్‌తో జరిగిన ఏడు టెస్టుల్లో బంగ్లాకు ఇది రెండో విజయం.SENA: సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రెండింటి ఓడించిన జట్టుగా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 2022లో మౌంట్ మాంగనుయిలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లా తాజాగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించింది.👉ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు మూడు టెస్టులు మాత్రమే ఆడింది. అయితే కేవలం మూడు టెస్టుల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ ఫీట్ ఆసియా జట్ల పరంగా అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌కు ఏడు టెస్టుల తర్వాత, భారత్‌కు 12 టెస్టుల తర్వాత తొలి టెస్టు విజయం దక్కింది. ఈ రెండు దేశాలను బంగ్లాదేశ్ అధిగమించడం విశేషం. మరోవైపు శ్రీలంక మాత్రం ఆసీస్ గడ్డపై 15 టెస్టులు ఆడినప్పటికీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.👉1995 తర్వాత ఆస్ట్రేలియాను తమ సొంతగడ్డపై భారత్ కాకుండా మరో ఆసియా జట్టు (బంగ్లాదేశ్) ఓడించడం 31 ఏళ్లలో ఇదే తొలిసారి.👉సొంతగడ్డపై రెండుసార్లు ఆసియా జట్ల (భారత్, బంగ్లాదేశ్) చేతిలో ఓటమి చవిచూసిన తొలి కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2024లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా తాజాగా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది.Historic Win in Darwin! 🇧🇩🔥 Bangladesh beat Australia by 9 wickets to seal a memorable victory in the 1st Test! 🏏🏆#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/PDrWJS8ZEs— Bangladesh Cricket (@BCBtigers) August 16, 2026 HISTORY WRITTENBangladesh becomes the Asian team to take least number of Tests to beat Australia in #Australia 🤯#Banvsaus #Australiancricket #Bangladeshcricket #Cricket #BANVSAUS pic.twitter.com/SE42IBxCbo— PRAKASH (@CHPRAKASH07) August 16, 2026Read: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్‌లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
విజయంపై బంగ్లాదేశ్ గురి
డార్విన్: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయానికి బంగ్లాదేశ్ చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 228 పరుగుల ఆధిక్యం దక్కగా... ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (43 బ్యాటింగ్), అలెక్స్ కేరీ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా...కంగారూ టీమ్ మరో 67 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యర్థిని త్వరగా కుప్పకూల్చి సాధ్యమైనంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించాలని బంగ్లా పట్టుదలగా ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 351/6తో మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ మిరాజ్ (65) కీలక అర్ధసెంచరీ సాధించాడు. శనివారం 28 ఓవర్లు ఆడిన బంగ్లా బ్యాటర్లు చివరి 4 వికెట్లకు మరో 75 పరుగులు జోడించారు. జోష్ హాజల్‌వుడ్ (6/89) ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. అతను ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 14 సారి కాగా... టెస్టుల్లో 300 వికెట్ల ఘనతను కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆరంభంలో వెదరాల్డ్ (0), ట్రవిస్ హెడ్ (17) వికెట్లు కోల్పోయింది. కొద్దిగా పోరాడిన లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (44) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం గ్రీన్, కేరీ కలిసి మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్ హీరో హసన్ మహమూద్ మళ్లీ చెలరేగి 2 వికెట్లు తీయగా... టాప్ బ్యాటర్ స్మిత్‌ను కీలక సమయంలో అవుట్ చేసిన మిరాజ్ ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు. బెయిల్స్‌ను యథాస్థానంలో పెట్టి... ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక అనూహ్య దృశ్యం చోటు చేసుకుంది. హసన్ మహమూద్ బౌలింగ్‌లో కట్ చేయడానికి ప్రయత్నించి హెడ్ బౌల్డయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ దాదాపు ఇదే తరహాలో మహమూద్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయిన హెడ్లో తీవ్ర నిరాశ కనిపించింది. అయితే అతను అవుట్ కాగానే క్రీజ్‌లో వీడలేదు. క్షణకాలం ఆగి కింద పడిన బెయిల్స్‌ను తీసి మళ్లీ స్టంప్స్‌పై యథాస్థానంలో పెట్టి హెడ్ నిష్క్రమించాడు. క్రికెట్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడలేదని ఆ సమయంలో కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. మరో వైపు 12 పరుగుల వద్ద గ్రీన్‌కు అదృష్టం కలిసొచ్చింది. తస్కీన్ బౌలింగ్‌లో అతని బ్యాట్‌కు తగిలిన బంతి లెగ్‌స్టంప్‌ను స్వల్పంగా తాకుతూ బౌండరీ చేరింది. అయితే బెయిల్స్ కింద పడకపోవడంతో గ్రీన్ బతికిపోయాడు. -
అదృష్టమంటే నీదే గ్రీన్!.. డబుల్ ధమాకా!
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడుతోంది. డార్విన్ వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి కూడా.. బంగ్లా కంటే వెనుకబడే ఉంది. కాగా రెండు దశాబ్దాల అనంతరం ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.ఆధిక్యంలోనే బంగ్లాదేశ్తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కంగారూ జట్టును 198 పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్... తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 228 పరుగుల మేర భారీ ఆధిక్యం సంపాదించింది బంగ్లాదేశ్.ఈ క్రమంలో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన బంగ్లా.. శనివారం నాటి మూడో రోజు ఆటలోనూ జోరు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ హసన్ మహమూద్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.క్రీజులో గ్రీన్, క్యారీ మహమూద్ బౌలింగ్‌లో ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (17), జేక్ వెదర్లాండ్ (0) బౌల్డ్ అయ్యారు. మిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 31 పరుగులతో రాణించాడు. అయితే, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక స్టీవ్ స్మిత్ 44 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.ఈ క్రమంలో మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ క్రీజులో నిలిచారు. గ్రీన్ 86 బంతుల్లో 43 పరుగులు, క్యారీ 50 బంతుల్లో 19 పరుగులతో ఉన్నారు. ఫలితంగా 53 ఓవర్లలో ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ కంటే ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. శనివారం నాటి ఆటలో కామెరాన్ గ్రీన్ అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 31వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో గ్రీన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి స్టంప్స్‌కు తాకింది.. కానీ బెయిల్స్‌ను పడగొట్టలేదు. అంతేకాదు.. బౌండరీ దిశగా దూసుకుపోయింది.దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక గ్రీన్ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి లక్కీగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్ శిబిరం ఊహించని ఈ పరిణామానికి బిక్కముఖం వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హెడ్ అతికించాడేమో!ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేందయ్యా ఇది! ఇది మేము చూడలేదు.. అదృష్టం అంటే నీదే. బహుశా ట్రవిస్ హెడ్ గమ్‌తో బెయిల్స్‌ను అంటించాడేమో! అందుకే అవి పడలేదు’’ అని ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. కాగా హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన తర్వాత హెడ్ బెయిల్స్ సర్ది మెల్లగా క్రీజును వీడాడు. చదవండి: వారెవ్వా హెడ్.. నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్ View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) -
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తూ ఓపెనర్ల వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.మరోసారి ఓపెనర్ల పని పట్టిన హసన్హసన్ మహమూద్ బౌలింగ్‌లో తొలుత జేక్ వెదర్లాండ్ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ 35 బంతుల్లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరిని అద్భుతమైన డెలివరీలతో మహమూద్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వెదర్లాండ్ (23), ట్రవిస్ హెడ్ (22) హసన్ మహమూద్ బౌలింగ్‌నే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.అదే తీరుగా మరోసారి బౌల్డ్అయితే, యాధృచ్చికంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే హెడ్ బౌల్డ్ అయ్యాడో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో మహమూద్ బంతితో రంగంలోకి దిగాడు. రెండో బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో మహమూద్ వేయగా.. స్క్వేర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్ బౌల్డ్ అయ్యాడు."I've never seen that in all my cricketing career."Travis Head chopped on for a second time in this match, but his considerate move even caught Adam Gilchrist off guard. #AUSvBAN pic.twitter.com/LEKgbtbshq— cricket.com.au (@cricketcomau) August 15, 2026నా కెరీర్లో ఇలాంటిది చూడలేదుఅయినప్పటికీ ఎంతో సంయమనంగా హెడ్.. బెయిల్స్‌ను తీసి స్టంప్స్ మీద సర్ది నెమ్మదిగా క్రీజును వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కామెంటెరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్.. ‘నా క్రికెటింగ్ కెరీర్లో ఇంత వరకు ఇలాంటిది చూడలేదు’ అని హెడ్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండుసార్లు ఒకే బౌలర్ బౌలింగ్‌లో.. ఒకే విధంగా అవుటైనప్పటికీ.. ప్రశాంతంగా ఉండటం అతడికే చెల్లించిందని చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఆధిపత్యంకాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లాదేశ్ మధ్య గురువారం మరారా స్టేడియంలో తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా 228 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 42 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా కంటే ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: జైస్వాల్‌ను రనౌట్ చేయనా? ఇందులో తప్పేముంది?.. కానివ్వు! -
ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్న హాజిల్‌వుడ్ ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 14వ సారి ఐదు వికెట్ల హల్ అందుకున్న హాజిల్‌వుడ్.. ప్రస్తుతం ఆసీస్ జట్టులో 300 వికెట్ల మార్క్ చేరుకున్న నాథన్ లియోన్, కమిన్స్, స్టార్క్ సరసన నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఏడో పేసర్‌గా హాజిల్‌వుడ్ నిలిచాడు. గతంలో మెక్‌గ్రాత్ (563 వికెట్లు), మిచెల్ స్టార్క్ (435 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (355 వికెట్లు), పాట్ కమిన్స్ (316 వికెట్లు), మిచెల్ జాన్సన్ (313 వికెట్లు), బ్రెట్ లీ (310) హాజిల్‌వుడ్ కంటే ముందున్నారు. టెస్టుల్లో 300 వికెట్లు పడగొట్టే క్రమంలో ఆస్ట్రేలియా తరఫున తక్కువ సగటుతో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలోనూ హాజిల్‌వుడ్ చోటు సంపాదించాడు. హాజిల్‌వుడ్ 24.02 సగటుతో 300 వికెట్ల మార్క్ చేరుకోగా, మెక్‌గ్రాత్ (21.64), కమిన్స్ (22.21), డెన్నిస్ లిల్లీ (23.92) ముందున్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తంజిద్ హసన్ (101) సెంచరీతో చెలరేగగా, నజ్ముల్ (84) రాణించాడు. మూడో రోజు ఆటలో మెహదీ హసన్ (65) అర్ధశతకం సాధించడంతో బంగ్లా 400 పరుగుల మార్క్‌ను దాటింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 228 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్, లియోన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్మిత్ (37), గ్రీన్ (6) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది.Josh Hazlewood joins an elite club - he becomes the 7th Australian pacer and 9th Australian bowler overall to 300 Test wickets 👏#AUSvBAN pic.twitter.com/Yag1VUY34k— Cricbuzz (@cricbuzz) August 15, 2026Josh Hazlewood also bagged his 14th fifer in Tests with his 300th scalp 🔥pic.twitter.com/7S6oFzafUq https://t.co/JB4JIGl9b7— Cricbuzz (@cricbuzz) August 15, 2026చదవండి: అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే! -
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్‌తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్‌లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్‌గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్‌స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్‌లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్‌గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్‌తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం -
మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత.. కపిల్‌దేవ్ రికార్డ్ బ్రేక్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ (434)ను మిచెల్ అధిగమించాడు.డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లిట్టన్ దాస్ వికెట్‌తో స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు. స్టార్క్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 106 మ్యాచ్‌లు ఆడి 435 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే డేల్ స్టెయిన్ (439) రికార్డును కూడా దాటేసి టాప్-5లోకి అతడు అడుగుపెడతాడు.ప్రస్తుతం స్టార్క్ ఆరో స్ధానంలో ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా మాత్రం స్టార్క్‌నే కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో జేమ్స్ అండర్సన్(704) అగ్రస్ధానంలో ఉన్నాడు.టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు:జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) – 704స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 439మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 435*కపిల్ దేవ్ (భారత్) – 434ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. బంగ్లా జట్టు ప్రస్తుతం 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
ముందు బయటకు నడువ్: మిరాజ్‌పై స్టార్క్ ఆగ్రహం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కంగారూలపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా జట్టు తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ కంగారూలకు చుక్కలు చూపించాడు.198 పరుగులకే ఆలౌట్మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితికి చేరుకుంది.తంజిద్ సెంచరీమొత్తంగా 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లా 351 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ సెంచరీ (101)తో కదం తొక్కగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో 84 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 32, హసన్ మహమూద్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.ముందు బయటకు నడువ్ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సహనం కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో స్టార్క్ వేసిన ఐదో బంతిని మిరాజ్ థర్డ్‌మాన్ దిశగా బాది సింగిల్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో మిరాజ్ పిచ్ (డేంజర్ ఏరియా) మధ్య నుంచి పరుగు తీశాడు. దీంతో స్టార్క్ కోపంతో ఊగిపోతూ.. ‘ముందు వికెట్ మీది నుంచి బయటకు నడువు’ అని హెచ్చరించాడు. ఇందుకు మిరాజ్ గట్టిగానే బదులిచ్చాడు. స్టార్క్ అడ్డుగా ఉండటం వల్లే తాను పిచ్ మధ్యలోకి పరుగు తీయాల్సి వచ్చిందని అంపైర్ కుమార్ ధర్మసేనకు చెప్పాడు.అంపైర్ కూడా వార్నింగ్ ఇచ్చాడుదీంతో స్టార్క్, మిరాజ్‌లను విడదీసిన ధర్మసేన.. మిరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే రెండుసార్లు పిచ్ డేంజర్ జోన్లోకి వచ్చావని.. మరోసారి గనుక ఇది పునరావృతమైతే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుందని హెచ్చరించాడు. "Get off the wicket!"Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8— cricket.com.au (@cricketcomau) August 14, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఇప్పటికి రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (20), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (0)లను అవుట్ చేశాడు.చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు -
స్మిత్ ప్రపంచ రికార్డు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. నజ్ముల్, లిటన్ దాస్‌లను తొలి రెండు క్యాచ్‌లుగా తీసుకున్న స్మిత్ 36 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపపట్టాడు. స్మిత్‌కు ఇది 218వ క్యాచ్. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో జో రూట్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 165 టెస్టుల్లో 218 క్యాచ్‌లు తీసుకుంటే స్మిత్ మాత్రం 124 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్‌లు) రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే (205 క్యాచ్‌లు), సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (200 క్యాచ్‌లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ నుంచి చూసుకుంటే వీవీఎస్ లక్ష్మణ్ (135 క్యాచ్‌లు), కోహ్లి (121 క్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ (115 క్యాచ్‌లు) టెస్టుల్లో వందకు పైగా క్యాచ్‌లు అందుకున్న జాబితాలో చోటు సంపాదించారు.తంజిద్ శతకం.. పట్టు బిగించిన బంగ్లామ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మెహదీ హసన్ (32 బ్యాటింగ్), హసన్ మహ్ముద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ (101) మెయిడెన్ శతకంతో మెరవగా, కెప్టెన్ నజ్ముల్ (84) అర్ధశతకంతో ఆకట్టుకోగా, మోమినుల్ హక్ (49) రాణించాడు. Photo Credit: Twitterఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీయగా, కమిన్స్, నాథన్ లియోన్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. రెండోరోజు ఆటలోనూ బంగ్లాదేశ్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లో రోజు మొత్తంలో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇప్పటికైతే ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ మంచి ఆధిక్యంలో నిలిచి టెస్టులో పట్టు బిగించిందని చెప్పొచ్చు. మ్యాచ్‌లో ఎవరిది పైచేయి కానుందనేది మూడోరోజు ఆటలో తేలిపోనుంది.Read: రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్! -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (197 బంతుల్లో 101 పరుగులు) శతకంతో చెలరేగాడు. డార్విన్ వేదికగా ఆడుతున్న టెస్టులో తంజిద్ తన కెరీర్లో డెబ్యూ సెంచరీ అందుకున్నాడు. అయితే తంజిద్‌కు ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు హసన్ సర్కార్ సాధించిన 76 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా విదేశాల్లో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా తంజిద్ నిలిచాడు. 2022లో మహ్మదుల్ హసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 137 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ మరో రికార్డు అందుకున్నాడు. గతంలో 2006లో షాహ్రియర్ నఫీ 138 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. నజ్ముల్ షాంటో (75 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక తంజిద్, నజ్ముల్ కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. అంతకముందు మోమినుల్ హక్ (49) అర్ధసెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. బంగ్లా బౌలర్ మహ్ముద్ హసన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇదే మ్యాచ్‌లో తస్కిన్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో బంగ్లాదేశ్ బౌలర్‌గా తస్కిన్ నిలిచాడు. తస్కిన్ కంటే ముందు షకీబ్ అల్ హసన్ (712 వికెట్లు), ముష్రఫె మోర్తజా (389), ముస్తాఫిజుర్ రెహ్మన్ (383), మెహదీ హసన్ (369 వికెట్లు), తైజుల్ ఇస్లామ్ (302 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 77 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.Tanzid Hasan has the first Test century of his career! 👏#MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/lXkIJrXHAO— cricket.com.au (@cricketcomau) August 14, 2026 A moment to remember. 💯🇧🇩 Tanzid Hasan Tamim celebrates a maiden Test century in Darwin! What a knock. 🔥🏏#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/WypnVcwYBw— Bangladesh Cricket (@BCBtigers) August 14, 2026Read: 47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్ -
సెంచరీ దిశగా తంజిద్.. బంగ్లా చేతిలో ఆసీస్‌కు చుక్కలు!
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ తంజిమ్ హసన్ (71 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హక్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ పేసర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్రయం వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించడం విశేషం. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధసెంచరీ చేయగా, మిగతావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హసన్ మహ్ముద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, తస్కిన్ అహ్మద్, ఇబదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్‌ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా పరుగుల వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుచకున్నాడు.చదవండి: క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి -
చరిత్ర సృష్టించిన మోమినుల్ హక్.. బీసీబీ చైర్మెన్ రికార్డ్ బ్రేక్
బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మోమినుల్ హక్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ల జాబితాలో మోమినుల్ దిగ్గజ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్‌ను దాటి రెండో స్థానానికి చేరుకున్నాడు. డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు.మోమినుల్ ఇప్పటివరకు 79 టెస్టుల్లో 5,166 పరుగులు చేశాడు. ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌గా ఉన్న తమీమ్ 70 టెస్టుల్లో 5,134 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (6,808 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. మోమినుల్ ఇదే జోరును కొనసాగిస్తే రహీమ్‌ను అధిగమించే అవకాశముంది. అతడి టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 13 సెంచరీలు ఉన్నాయి. తమీమ్, ముష్ఫికర్ తర్వాత బంగ్లాదేశ్ తరఫున 10కి పైగా టెస్టు సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్ హక్నే కావడం గమనార్హం.బంగ్లా తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరేముష్ఫికర్ రహీమ్ – 6,808 పరుగులు మోమినుల్ హక్ – 5,166 పరుగులు తమీమ్ ఇక్బాల్ – 5,134 పరుగులు నజ్ముల్ హుస్సేన్ శాంటో – 2,579 పరుగులుఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్‌కు బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది. బంగ్లా బౌలర్ల ధాటికి కంగారులు తమ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ 6 వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (20) త్వరగా ఔటైనప్పటికి.. క్రీజులోకి వచ్చిన మోమినుల్ హక్, ఓపెనర్ తాంజిద్ హసన్ తమీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. -
'నాకు తెలుసు అది అవుటని'.. నిజం ఒప్పుకొన్న స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియాకు వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ చుక్కలు చూపిస్తోంది. డార్విన్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో బంగ్లా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. బంగ్లా బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హసన్ మహమూద్ 6 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(71) ఒక్కడే రాణించాడు. అయితే స్మిత్ కూడా తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాల్సి ఉండేది. కానీ సాంకేతిక తప్పిదం వల్ల అతడు కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అసలేమి జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన బంగ్లాదేశ్ పేసర్ ఎబాదత్ హొస్సేన్.. నాలుగో బంతిని స్మిత్‌కు ఫిప్త్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని స్టీవ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌కు చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్‌తో పాటు బంగ్లా ఫీల్డర్లు క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. స్మిత్ తాను అవుటయ్యాననే భావనతో స్మిత్ పెవిలియన్ వైపు నడవబోయాడు. కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన నాటౌట్ అని తల ఊపడంతో అంతా షాకయ్యారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రివ్యూ కోరాడు. అయితే థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ 'రియల్-టైమ్ స్నిక్కోమీటర్ (RTS)'ను పరిశీలించగా, బంతి బ్యాట్‌కు తగిలినట్లు ఎటువంటి స్పైక్ కనిపించలేదు. స్నికోలో స్పైక్ రాకపోయినప్పటికి బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు క్లియర్‌గా కనిపించింది. కానీ టెక్నాలజీనే పరిగణలోకి తీసుకున్న నితిన్ మీనన్ తన నిర్ణయాన్ని నాటౌట్ ప్రకటించాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు తీవ్ర నిరాశచెందారు.ఇక ఇదే విషయంపై తొలి రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో స్మిత్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తనకు అదృష్టం కలిసొచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు.జర్నలిస్ట్: బంతి బ్యాట్‌కు తగిలిందని మీకు అనిపించిందా?స్మిత్: అవును, తగిలిందనే అనుకుంటున్నా! నేను అదృష్టవంతుడిని. కొన్నిసార్లు అలాంటివి మనం స్వీకరించక తప్పదు.జర్నలిస్ట్: మీరు ఈ టెక్నాలజీ నమ్ముతున్నారా?స్టీవ్ స్మిత్: "సాధారణంగా 'రియల్-టైమ్ స్నిక్కోమీటర్ టెక్నాలజీ బాగానే పనిచేస్తుంది. బ్యాట్‌కు బంతికి తాకిందో లేదో నాకైతే స్పష్టంగా తెలియదు. కానీ కొంతవరకు ఎడ్జ్ తీసుకున్నట్లే అనిపించింది. అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా ఈరోజు టెక్నాలజీ నన్ను కాపాడింది.! అయితే నెటిజన్లు మాత్రం ఎక్స్ వేదికగా స్మిత్‌పై మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడం ఆసీస్ ఆటగాళ్లకే అలవాటే అని మండిపడుతున్నారు. -
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్‌పై ఫైర్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.చెలరేగిన హసన్ మహమూద్ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్‌లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.198 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.ఆటకు అంతరాయంసెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్‌ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.ఓవరాక్షన్ చేయకుఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
ఆసీస్‌ను గడగడలాడించిన బంగ్లాదేశ్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు పసికూన బంగ్లాదేశ్ పూర్తి ఆధిక్యత సాధించింది. తొలుత బౌలింగ్‌లో ఆసీస్‌ను 198 పరుగుల స్వల్ప స్కోర్‌కు కుప్పకూల్చి, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 96 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మరో 102 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. మొత్తంగా తొలి రోజు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో సత్తా చాటి పటిష్టమైన ఆస్ట్రేలియాను గడగడలాడించింది.నిప్పులు చెరిగిన హసన్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బంగ్లా పేస్ త్రయం హసన్ మహమూద్ (6-55), తస్కిన్ అహ్మద్ (2-55), ఎబాదత్ హొసేన్ (2-39) ధాటికి 198 పరుగులకే ఆలౌటైంది. వీరిలో ముఖ్యంగా హసన్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి ముందు ఏ ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా నిలబడలేకపోయాడు. ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ (71) ఒంటరిపోరాటం చేశాడు.ప్రభావం చూపని స్టార్ పేసర్లుఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను స్టార్క్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. జట్టు స్కోర్ 36 పరుగుల వద్ద ఉండగా.. షద్మాన్ ఇస్లాంను (20) పెవిలియన్‌కు పంపాడు. అయితే ఆతర్వాత తంజిద్ హసన్ తమీమ్ (32 నాటౌట్), మొమినుల్ హక్ (35 నాటౌట్) ఆసీస్ స్టార్ పేసర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. వీరి ముందు కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ త్రయం తేలిపోయింది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్కే వేదికగా ప్రారంభం కానుంది. -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లామ్‌ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (434) తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగన హెరాత్‌ను (433) అధిగమించాడు.ఇదివరకే లెఫ్ట్ ఆర్మ్ పేసర్లలో అత్యధిక వికెట్ల వీరుడిగా చలామణి అవుతున్న స్టార్క్‌కు ఇది మరో చారిత్రక మైలురాయి. స్టార్క్ 414 వికెట్లు తీసిన పాక్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ గన్ వసీం అక్రం (414) రికార్డును కొన్ని మ్యాచ్‌ల ముందే అధిగమించాడు.ప్రస్తుతం ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల జాబితాలో స్టార్క్ (106 టెస్ట్‌ల్లో 434 వికెట్లు) అగ్రస్థానంలో నిలువగా.. రంగన హెరాత్ (93 టెస్ట్‌ల్లో 433), వసీం అక్రం (104 టెస్ట్‌ల్లో 414), డేనియల్ వెటోరీ (113 టెస్ట్‌ల్లో 362), చమింద వాస్ (111 టెస్ట్‌ల్లో 355) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళే ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. హసన్ మహమూద్ (6-55), తస్కిన్ అహ్మద్ (2-55), ఎబాదత్ హొసేన్ (2=39) ధాటికి 198 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ (71) ఒంటరిపోరాటం చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను స్టార్క్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. 36 పరుగుల జట్టు స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో లియోన్‌కు క్యాచ్ ఇచ్చి షదాన్ ఇస్లాం (20) ఔటయ్యాడు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 58-1గా ఉంది. తంజిద్ హసన్ (19), మొమినుల్ హక్ (12) క్రీజ్‌లో ఉన్నారు. -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంతకు ముందు బంగ్లా బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఆరేసిన మహమూద్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లా మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత డార్విన్‌లోని మరారా స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అనూహ్య రీతిలో 198 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది.ఆది నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు బంగ్లా పేసర్ హసన్ మహమూద్. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23)లతో పాటు.. స్టీవ్ స్మిత్ (71) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (7) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి బంగ్లా బౌలర్గామొత్తంగా ఆసీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మహమూద్.. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.ముఖాముఖి పోరులో హీరోగా..అదే విధంగా.. ఆసీస్- బంగ్లా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా 26 ఏళ్ల మహమూద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ పేసర్ జేసన్ గిల్లెస్పి పేరిట ఉండేది. 2003లో గిల్లెస్పి బంగ్లాదేశ్‌తో టెస్టులో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. మహమూద్ తాజాగా అతడిని అధిగమించాడు.ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు1. మైకేల్ కాస్ప్రోవిక్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 7/392. హసన్ మహమూద్ (బంగ్లాదేశ్)- 2026లో ఆస్ట్రేలియా మీద 6/553. చమిందా వాస్ (శ్రీలంక)- 2004లో ఆస్ట్రేలియా మీద 5/314. గ్లెన్ మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 5/375. స్టువర్ట్ మెక్‌గిల్ (ఆస్ట్రేలియా)- 2003లో బంగ్లాదేశ్ మీద 5/65. చదవండి: వైభవ్ విషయంలో అది నేను అంగీకరించను: ఆసీస్ దిగ్గజంHasan Mahmud’s 6-Wicket Haul vs Australia | 1st Test 🔥🇧🇩 pic.twitter.com/5qaJN4qTss— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2026 -
నిప్పులు చెరిగిన బంగ్లా పేసర్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.ఆట ప్రారంభం నుంచే అనుకూలంగా ఉన్న పరిస్థితులను బంగ్లాదేశ్ పేసర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఒక దశలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసినప్పటికీ.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది.హసన్ మహమూద్ ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 55 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి కెరీర్లో గుర్తుండిపోయే స్పెల్ నమోదు చేశాడు. అతడి బౌలింగ్‌కు తోడు మిగతా బంగ్లా పేసర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించలేకపోయింది. తస్కిన్ అహ్మద్ (16-2-55-2), ఎబాదత్ హొసేన్ (11-2-39-2) కూడా ఆసీస్ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.స్టీవ్ స్మిత్ ఒంటరిపోరాటంఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ ఒంటరిపోరాటం చేశాడు. 109 బంతుల్లో 71 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అతడికి జతగా ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్‌లో నిలువలేకపోయాడు. మొత్తం ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌తో పాటు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదరాల్డ్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో గ్రీన్ (13), అలెక్స్ క్యారీ (19), వెబ్‌స్టర్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. లబూషేన్ (1), కమిన్స్ (9), స్టార్క్ (1), లియోన్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. 4 పరుగులతో హాజిల్‌వుడ్ అజేయంగా నిలిచాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్కే వేదికగా ప్రారంభం కానుంది. -
ఆసీస్‌ను వణికించిన బంగ్లా పేసర్లు
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తొలి సెషన్ ముగిసే సమయానికి 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్‌పై అనుకూల పరిస్థితులను బంగ్లాదేశ్ పేసర్లు సమర్థంగా వినియోంచుకున్నారు.ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించిన జేక్ వెదరాల్డ్ (23)ను జట్టు స్కోర్ 45 పరుగుల వద్ద ఉండగా హసన్ మహదుద్ బోల్తా కొట్టించాడు. అదే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు లభించిన తొలి సక్సెస్. ఆమరుసటి ఓవర్లోనే హసన్ మరోసారి చెలరేగాడు. జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద ఉండగా.. ట్రవిస్ హెడ్‌ను (22) క్లీన్ బౌల్డ్ చేశాడు.కొద్ది సేపటికి మరో పేసర్ ఎబాదత్ హొసేన్ చెలరేగాడు. 61 పరుగుల జట్టు స్కోర్ వద్ద అప్పటికే క్రీజ్‌లో ఇబ్బందిపడుతున్న లబూషేన్‌ను (1) ఔట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే తస్కిన్ అహ్మద్ కెమరూన్ గ్రీన్‌ను (13) బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్ లంచ్ విరామం సమయానికే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే ఈ దశలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఐదో వికెట్‌కు అజేయమైన 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్టీవ్ 37, క్యారీ 18 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఆసీస్ స్కోర్ 128-4గా ఉంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్కే వేదికగా ప్రారంభం కానుంది. -
బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. జట్టులో ప్రధాన బౌలర్లకు రెస్ట్ ఇస్తారని భావించినప్పటికీ, దానిని కొట్టిపారేస్తూ ఆసీస్ జట్టు బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌లను తొలి టెస్టులో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. తుది జట్టు ఖరారు కాకపోయినప్పటికీ జట్టులోని ప్రధాన బౌలర్లను కొనసాగించాలని చూస్తోంది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ తమ స్థానాన్ని నిలుపుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దానిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాదిలోగా ఆస్ట్రేలియా మరో 21 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కమిన్స్, హాజిల్‌వుడ్ లేనప్పటికీ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చెలరేగిందంటే దానికి ప్రధాన కారణం స్కాట్ బోలండ్. ఫామ్‌లో ఉన్నప్పటికీ హాజిల్‌వుడ్ కోసం బోలండ్ను తప్పించాల్సిన పరిస్థితి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎదురైంది. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్‌గా నాథన్ లియోన్ కీలకం కానున్నాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నాథన్ లియోన్ పునరాగమనం ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌ను మరింత బలంగా మార్చింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్ రానుండగా, లబుషేన్, స్మిత్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ ఆడనున్నారు. కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బ్యూ వెబస్టర్లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.ఇక 2003 తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుంది. చివరిసారి తలపడినప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. డార్విన్, కెయిర్న్స్ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయాలతో బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బో వెబ్‌స్టర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్వుడ్సిరీస్ షెడ్యూల్:మొదటి టెస్ట్: ఆగస్టు 13-17, డార్విన్రెండవ టెస్ట్: ఆగస్టు 22-26, మెకేRead: హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం! -
8 వికెట్లతో ఆసీస్ బౌలర్ విజృంభణ
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మెహిది హసన్ మిరాజ్ అజేయ సెంచరీతో (109) ఆదుకోవడంతో ఓ మోస్తరు స్కోర్ (263) చేసిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ యువ సంచలన పేసర్ క్యాంప్‌బెల్ థాంప్సన్ (11-2-25-8) ధాటికి 54 పరుగులకే కుప్పకూలింది. మధ్యలో టేగ్ విల్లీ (130) శతక్కొట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది. థాంప్సన్ వీర విజృంభణ దెబ్బకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఆసీస్‌తో రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ డార్విన్ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 22 నుంచి మెక్‌కేలో ప్రారంభం కానుంది.తాజా సంచలన ప్రదర్శన తర్వాత క్యాంప్‌బెల్ థాంప్సన్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేసర్ ఎవరా అని ఆరా తీయడం ప్రారంభించారు.ఎవరీ క్యాంప్‌బెల్ థాంప్సన్..?దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్‌కు చెందిన థాంప్సన్ 2023లో క్లబ్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2025 ఆగస్టులో అడిలైడ్ స్ట్రైకర్స్ అకాడమీలో చోటు సంపాదించాడు. అక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత 2025 నవంబర్‌లో ఇంగ్లాండ్ XIతో జరిగిన మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ XI తరఫున అరంగేట్రం చేశాడు.2025-26 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.అయితే బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ అతడి కెరీర్లోనే అతిపెద్ద బ్రేక్‌థ్రూ. రెండో ఇన్నింగ్స్‌లో 8/25తో చెలరేగి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.స్టార్క్‌కు వారసుడవుతాడా..?వేగంగా బంతులు వేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యం థాంప్సన్‌కు అతిపెద్ద బలం. ఇదే అతడిని ఆస్ట్రేలియా భవిష్యత్ పేస్ దళంలో కీలక ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది.ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే యువ పేసర్లను ఆస్ట్రేలియా వెతుకుతోంది. ఈ క్రమంలో థాంప్సన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.ప్రస్తుతం అతడి ఫస్ట్‌క్లాస్ అనుభవం చాలా తక్కువే. కానీ బంగ్లాదేశ్‌పై చేసిన ప్రదర్శన మాత్రం అతడి సామర్థ్యాన్ని చాటింది. ఇదే స్థాయిలో రాణిస్తే.. త్వరలోనే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి థాంప్సన్‌కు పిలుపు రావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.భవిష్యత్తులో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనైనా.. అంతకంటే ముందే అయినా.. ఈ యువ ఎడమచేతి పేసర్‌కు అవకాశం దక్కుతుందేమో చూడాలి. థాంప్సన్‌కు బ్యాటింగ్‌లోనూ మంచి సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ప్రొఫైల్ ప్రకారం అతడు కుడి చేతి వాటం బ్యాటర్. అతన్ని బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తారు. -
ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ మధ్యలో మరో సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఒకేసారి రెండు సిరీస్‌లు ఆడనున్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఆసీస్‌తో రెండు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండగా.. బంగ్లాదేశ్ హై పెర్ఫార్మెన్స్ (HP) జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2026లో పాల్గొననుంది.వార్మప్ మ్యాచ్‌తో ప్రారంభంబంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పర్యటన ఆగస్టు 6న క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగే మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత ఆగస్టు 13న డార్విన్‌లోని మారారా క్రికెట్ గ్రౌండ్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మెక్‌కేలో ఆగస్టు 22న మొదలవుతుంది. 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ఇది.అదే రోజు బంగ్లాదేశ్ HP జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. బంగ్లాదేశ్ HP జట్టు వరుసగా మూడో ఏడాది టాప్ ఎండ్ టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్ ఒకే రోజు నిర్వహించనున్నారు.ఈ టోర్నీలో బంగ్లాదేశ్ HPతో పాటు నేపాల్, న్యూజిలాండ్ A, ఆతిథ్య NT స్ట్రైక్, హోబార్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, విక్టోరియా జట్లు పాల్గొంటాయి.2024లో ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2024లో అక్బర్ అలీ నేతృత్వంలోని బంగ్లాదేశ్ HP జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే టైటిల్ పోరులో అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆ టోర్నీలో బంగ్లాదేశ్ బౌలర్ రిపోన్ మొండోల్ 15 వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో పర్వేజ్ హొసైన్ ఎమోన్ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే 2025 సీజన్లో బంగ్లాదేశ్ HP ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. నేపాల్, NT స్ట్రైక్‌పై గెలిచిన బంగ్లాదేశ్.. పాకిస్థాన్ A, పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓడిపోయింది. -
AUS vs BAN: ఆస్ట్రేలియాకు భారీ షాక్
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్ కూడా చేరాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లో నెసర్ కుడి పిక్క గాయానికి గురయ్యాడు.ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు నెసర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించాడు.కాగా బంగ్లాతో టెస్టుల కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల ఆసీస్ ప్రధాన జట్టులో నెసర్ లేడు. కానీ కమిన్స్, హేజిల్‌వుడ్‌లకు బ్యాకప్ బౌలర్‌గా తీసుకోవాలని ఆసీస్ సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో మరో ప్రత్యామ్నాయ బౌలర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. యాషెస్ సిరీస్‌లో ఆడిన బ్రెండన్ డాగెట్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న జోష్ ఇంగ్లిష్ మాత్రం తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటున్నాడని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఇక ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్ -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్ జట్టుకు శుభవార్త
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఊరట లభించింది. గాయం కారణంగా తొలుత జట్టులో చోటు దక్కని స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్, కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.జూలై 26న ప్రకటించిన బంగ్లాదేశ్ తొలి 15 మంది సభ్యుల జట్టులో లిట్టన్ దాస్‌కు చోటు దక్కలేదు. ఎడమ కాలి కాఫ్ మసిల్కు గ్రేడ్-1 గాయం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి.అయితే పునరావాస ప్రక్రియలో లిట్టన్ వేగంగా కోలుకున్నాడు. అవసరమైన ఫిట్నెస్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తొలి టెస్టుకు అతడిని జట్టులోకి చేర్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 13న డార్విన్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి మొదలవుతోంది. టెస్ట్ మ్యాచ్‌లకు ముందు ఆగస్ట్ 6-8 వరకు బంగ్లాదేశ్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగనుంది.2003 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడబోతుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్. -
చారిత్రత్మక టెస్ట్ సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా జరగనున్న తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యం వహించనున్నాడు. బంగ్లాదేశ్ జట్టు 2003 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్ ఆడనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-26లో భాగంగా జరగనుంది. కాబట్టి ఈ సిరీస్‌కు ఇరు జట్లకు కీలకం కానుంది. కాగా ఆల్‌రౌండర్ సౌమ్య సర్కార్‌కు చాన్నాళ్ల తర్వాత బంగ్లా టెస్ట్ జట్టులో చోటు దక్కింది. సర్కార్ చివరగా 2021లో బంగ్లా తరపున టెస్టుల్లో ఆడాడు. అదేవిధంగా సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, మోమినుల్ హక్ జట్టులో చోటు దక్కించుకున్నారు.పేస్ బౌలింగ్ విభాగంలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ వంటి ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు అన్క్యాప్డ్ పేసర్ ముష్ఫిక్ హసన్‌కు కూడా తొలిసారి జట్టులో స్థానం లభించింది.ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.5% పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 58.33% పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్. -
అక్కడే మేం గెలిచాం.. ఆసీస్ సిరీస్‌పై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు."గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్‌స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.అయితే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్‌కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్‌స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.తొలి టెస్ట్ డార్విన్ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఓ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 6-8 వరకు డార్విన్ వేదికగా జరుగనుంది. -
కమిన్స్ రీఎంట్రీ.. యాషెస్ హీరోకు మొండిచేయి!
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు సీనియర్లు జోష్ హాజిల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనుండగా, 2025-26 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ నెసర్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. ఆగస్టు 13 నుంచి 17 వరకు డార్విన్ వేదికగా తొలి టెస్టు, మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. 13 మందితో కూడిన జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్ ఉన్నారు.ఇక గతేడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు అనంతరం వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఇక కండరాల గాయంతో జోష్ హాజిల్‌వుడ్ కూడా యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియోన్ మరోసారి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలోనూ గతేడాది సొంతగడ్డపై యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో నెగ్గింది. ఈ సిరీస్‌లో మైకెల్ నెసర్ రాణించాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 15 వికెట్లు తీయడమే గాక, చివరి రెండు టెస్టుల్లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయితే కమిన్స్, హాజిల్‌వుడ్ జట్టులోకి రావడంతో నెసర్‌ను జట్టు తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2027 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా వచ్చే సీజన్ (2027-2029) సైకిల్లోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. తర్వాతి 12 నెలల్లో ఆస్ట్రేలియా మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు:పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్Read: దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త! -
రెండో టీ20లో బంగ్లా ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై ఆసీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు కావడం గమానార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్‌లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కూపర్ కానోలి పవర్‌ప్లేలోనే అవుట్ కావడంతో ఆసీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మాట్ రెన్షా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89), టిమ్ డేవిడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది. బంగ్లాదేశ్ పవర్‌ప్లే ముగిసేసరికి 72/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత పర్వేజ్ హుస్సేన్(36), సైఫ్ హసన్(42) అవుట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగింది. చివరిలో తౌహిద్ హృదయ్ పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్దీ రెండు, నాథన్ ఎల్లీస్, రెన్షా, జంపా, డేవిస్ తలా వికెట్ పడగొట్టారు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కంగారుల తేలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్ గెలుపుతో అందుకు మార్ష్ సేన ప్రతీకారం తీర్చుకుంది.చదవండి: IPL 2027: యువరాజ్ సింగ్ ఐపీఎల్ రీఎంట్రీ? -
77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా వుమెన్‌ను 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన మొలినెక్స్ బృందం.. తాజాగా బంగ్లాదేశ్ మహిళా జట్టుపై కూడా ఘన విజయం సాధించింది.టాపార్డర్ కుదేలు లీడ్స్ వేదికగా హెడింగ్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టాపార్డర్ కుదేలైంది. ఆసీస్ పేసర్ కిమ్ గార్త్.. ఓపెనర్లలో దిలారా అక్తర్‌ను డకౌట్ చేయడంతో పాటు.. జువేరియా ఫిర్దోస్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.వన్‌డౌన్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (5)ను ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం బంగ్లా సారథి నిగర్ సుల్తానా (27)ను కూడా మొలినెక్స్ LBWగా వెనక్కి పంపింది. ఇక మిగిలిన వారిలో శోభనా మొస్తరీ (4), షోర్నా అక్తర్ (0) వికెట్లను ఎలిస్ పెర్రీ తన ఖాతాలో వేసుకోగా.. రీతూ మోనీ (16)ని జార్జియా వారేహామ్.. రెబెయా ఖాన్ (8)ను అన్నాబెల్ సదర్లాండ్ పెవిలియన్‌కు పంపారు.77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదనఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 77 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ జార్జియా వోల్ (32 బంతుల్లో 45)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 19) అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ బెత్ మూనీ (10) మాత్రం మరూఫా అక్తర్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. కాగా బంగ్లాపై విజయంతో గ్రూప్-‘ఎ’లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ -
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్.. నేటి మ్యాచ్‌లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి, ఆసీస్‌ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్ (2 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా ఆసీస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ .. తౌహిద్ హృదోయ్ (83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కన్నోల్లీ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్ కూడా ఆసీస్ చేజారేది. షోరిఫుల్ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్ తదుపరి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చట్టోగ్రామ్ వేదికగా జూన్ 17న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 11) జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను హస్తగతం చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తౌహిద్ హృదోయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) అజేయమైన ఇన్నింగ్స్‌లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో తంజిద్ హసన్ డకౌట్ కాగా.. లిటన్ దాస్ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్ హొసేన్ 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, మెరిడిత్, జంపా, రెన్షా, గ్రీన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆసీస్ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25), అలెక్స్ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3), తన్వీర్ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే జూన్ 14న జరుగనుంది. కాగా, ఆసీస్‌కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. ఈ సిరీస్‌కు ముందు ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. -
ఆసీస్ సిరీస్ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా
త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్ జట్లను ఇవాళ (జూన్ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్‌తో టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ పేరును ప్రకటించారు.ఈ సిరీస్‌తో పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్ ఆసీస్ బ్యాటింగ్ యూనిట్‌పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్‌లో ఆడిన తంజిమ్ హసన్ షకీబ్, రిపన్ మొండల్, మొహమ్మద్ సైఫుద్దీన్‌లకు చోటు దక్కలేదు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్ విషయానికొస్తే.. నజ్ముల్ హసన్ షాంటో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్ హృదోయ్ టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, మొమినుల్ హక్ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్ రోబివుల్ హాక్కు అవకాశం లభించింది.ఆసీస్‌తో మూడు మ్యాచ్ టీ20 సిరీస్ జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్ జూన్ 28 నుంచి హరారేలో జరుగనుంది.ఆస్ట్రేలియా సిరీస్‌కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదోయ్, అమిటే హసన్, రోబివుల్ హాక్. -
బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ
బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు.ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్‌కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్‌లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్‌ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. డక్త్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది. -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఢాకా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. బంగ్లా పేస్ బౌలర్ల ధాటికి కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.టాస్కిన్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లో నాలుగో బంతికి మాథ్యూ షార్ట్ ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు తొలి వన్డేలో కూడా ఇదే తరహాలో షార్ట్ అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ పర్యాటక జట్టను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి కూపర్ కొన్నోలీ(0).. ఆఖరి బంతికి రెన్షా(0) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా తమ స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఆస్ట్రేలియా తమ 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా బోర్డుపై లేకుండా 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.అంతేకాకుండా ఈ ఘోరమైన రికార్డు నమోదు చేసిన తొలి ఆసియా యేతర జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా కంగారులు కూడా ఈ జాబితాలో చేరారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిష్(34), గ్రీన్(25) కాసేపు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇంగ్లిష్ ఔటయ్యాకు ఆసీస్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కాగా బంగ్లా పర్యటనకు ముందు పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కూడా 2-1 తేడాతో ఆస్ట్రేలియా కోల్పోయింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: Vaibhav suryavanshi: మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం -
AUS vs BAN: ఆసీస్ గడ్డపై ‘మనోడి’ చరిత్ర
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్‌లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్‌కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్‌కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.ఆల్‌రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్‌కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్‌కు అవకాశం వచ్చింది.ఎవరీ నిఖిల్ చౌదరి?ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన అంకుల్‌ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.అలా దేశీ క్రికెట్లో అవకాశంలెగ్స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్‌కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్‌ను పిలిపించింది.ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.ఏదేమైనా భారత్‌లో అవకాశాలు లేక ఆసీస్‌కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.చదవండి: వైభవ్ మారలేదు.. శ్రీలంకలో మెరుపులు -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్‌ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్‌కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఔట్‌సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్‌ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్‌గా మళ్లీ అతడే
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, స్పిన్నర్ తన్వీర్ సంఘా దూరమయ్యారు. మార్ష్ చీలమండ గాయం (Ankle Injury) కారణంగా తప్పుకోగా.. డేంజరస్ ఓపెనర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది.మరోవైపు పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన తన్వీర్ సంఘా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇక మరోసారి మార్ష్ స్ధానంలో జట్టు పగ్గాలను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ అప్పగించింది.అయితే జూన్ 17 నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ సమయానికి జట్టుతో మార్ష్ కలుస్తాడని సెలెక్టర్ టోనీ డోడెమైడ్ తెలిపారు. కాగా కొత్తగా వన్డే జట్టులోకి మాథ్యూ షార్ట్, ఓలివర్ పీక్, టాడ్ మర్ఫీ వచ్చారు. ఓలివర్ పీక్, షార్ట్ పాకిస్తాన్‌తో వన్డేలు ఆడినప్పటికి.. మర్పీకి మాత్రం తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఇరు జట్ల మధ్య ఈ వన్డే సిరీస్ జూన్ 9 (మంగళవారం) నుండి ఢాకాలో ప్రారంభం కానుంది. పాక్‌తో సిరీస్‌ను 2-1తో కోల్పోయిన కంగారులు తిరిగి తమ రిథమ్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.బంగ్లాతో వన్డేలకు ఆసీస్ జట్టుజోష్ ఇంగ్లిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కానల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
3 మ్యాచ్‌ల వన్డే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్‌లోని తొలి 2 మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జూన్ 3) ప్రకటించారు.స్టార్ ఆల్‌రౌండర్ మొసద్దెక్ హొసేన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.మొసద్దెక్తో పాటు నురుల్ హసన్ కూడా గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, తౌహిద్ హృదోయ్, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.ఈ సిరీస్‌లోని వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌లో జరుగనున్నాయి.ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం మోంగ్‌కాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్ కేవలం 14 బంతుల్లో 8 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూపర్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్‌డెర్మాట్‌తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు 20 సిక్స్‌లు బాదారు.తడబడిన బంగ్లా..అనంతరం బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున అబు హైదర్ ఒంటరి పోరాటం చేశాడు. హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది.చదవండి: అతడు లేకపోవడం కలిసొచ్చింది.. వారి వల్లే చెలరేగుతున్నాను: అభిషేక్ -
వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్‌ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్‌పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్‌లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్‌కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్‌పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్‌ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు) ఉన్నారు. స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్‌కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్‌కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో నమోదైంది. ఆ ఎడిషన్‌లో బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
ఆస్ట్రేలియా బౌలర్ హ్యాట్రిక్ తీశాడు.. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుంది..!
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకు హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసొస్తుందని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో (2007) బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఎడిషన్‌లో భారత్ టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆసీస్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా ఫ్యాన్స్ ఆశలకు మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే.. నాడు బ్రెట్ లీ, ఇప్పుడు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్పైనే హ్యాట్రిక్ వికెట్లు సాధించారు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదు
టీ20 వరల్డ్‌కప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఈ ఘనత సాధించాడు. సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. 2007 ఎడిషన్‌లో బ్రెట్ లీ ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కమిన్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు (మహ్మదుల్లా), ఆరు బంతులకు (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి (తౌహిద్ హ్రిదోయ్) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. -
మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలలోనే ఊదిపడేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 132 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మార్ష్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.క్రీజులో అడుగుపెట్టనప్పటినుంచే బౌండరీలు వర్షం కురిపించాడు. అతడితో పాటు డేవిడ్ వార్నర్(53), స్టీవ్ స్మిత్(63 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదయ్(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాంటో(45), లిటన్ దాస్(36) పరుగులతో రాణించారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..! -
WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్ అవుట్’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది. టైమ్డ్ అవుట్ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్ లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్‌ను ఫేస్ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ చరిత్రకెక్కగా.. షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్‌కు ఓ షాక్ తగిలింది. చేతివేలికి గాయం శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బేజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘అవుట్’ కాగా శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో మాథ్యూస్ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డ షకీబ్.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో షకీబ్ వికెట్‌ను మాథ్యూస్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్ కంటిన్యూ చేస్తున్న బౌలర్(షకీబ్ అల్ హసన్) ఖాతాలో మాత్రం జమకాదు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు కాగా ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి. చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
WTC: ఫైనల్ రేసులో దూసుకుపోతున్న ఆస్ట్రేలియా, టీమిండియా
World Test Championship 2021-23 Updated Table: అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మేటి జట్లు. ఇలాంటి బలమైన ప్రత్యర్థుల మధ్య టెస్టు మ్యాచ్ రెండే రోజుల్లో ముగియడం అసాధారణం. కానీ అదే జరిగింది.. పేసర్లకు స్వర్గధామమైన ‘గాబా’ పిచ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆదివారం దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఈ విజయంతో 12 పాయింట్లు సాధించింది కమిన్స్ బృందం. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో గెలుపొంది మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. ఆసీస్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమితో రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా ఒక స్థానం దిగజారి ప్రస్తుతం మూడో టాప్-3లో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సీజన్ 2021-23 సీజన్లో టాప్-4లో ఉన్న జట్లకు మిగిలి ఉన్న మ్యాచ్‌లు, ఆసీస్- ప్రొటిస్ మొదటి టెస్టు ముగిసిన తర్వాత ఫైనల్ చేరే క్రమంలో ఏయే జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం! ఆస్ట్రేలియా ►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- 6 ►స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు, భారత పర్యటనలో నాలుగు టెస్టులు ►ప్రస్తుతం 120 పాయింట్లు(76.92 శాతం)తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ►సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను మరో రెండు మ్యాచ్‌లలో ఓడిస్తే ఇక టీమిండియాతో మాత్రమే టాప్-1 స్థానానికి పోటీ ఉంటుంది. ►స్వదేశంలో భారత జట్టును కట్టడి చేయగలిగితే ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టాప్-1 జట్టుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. టీమిండియా ►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- బంగ్లాదేశ్ టూర్లో ఒకటి, స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ►ప్రస్తుతం పాయింట్లు 87(55.77 శాతం) ►బంగ్లాతో రెండో టెస్టు గెలిచి, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నామమాత్రంగా రాణించినా చాలు రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం టీమిండియా సొంతమవుతుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక(PC: ICC) దక్షిణాఫ్రికా ►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- ఆస్ట్రేలియాతో రెండు, స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ►ప్రస్తుతం పాయింట్లు- 72(54.55 శాతం) ►ఆసీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమితో దక్షిణాఫ్రికా రెండోస్థానాన్ని టీమిండియాకు కోల్పోయింది. అయితే, ఈ పరాజయం తర్వాత కూడా డీన్ ఎల్గర్ బృందానికి ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులు గెలవడం సహా విండీస్‌ను కట్టడి చేస్తే టాప్-2లో చోటు దక్కించుకోవచ్చు. శ్రీలంక ►మిగిలి ఉన్న మ్యాచ్‌లు- న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు ►ప్రస్తుతం 64 పాయింట్లు(53.33 శాతం) ►కివీస్ గడ్డపై లంక విజయాల శాతం చాలా తక్కువ. 19 సార్లు టెస్టుల్లో ఆతిథ్య జట్టుతో పోటీపడితే కేవలం రెండుసార్లు గెలిచింది. ఇక ఇప్పుడు అద్భుతం జరిగి మిగిలిన రెండు టెస్టులు గెలిచినా 61.1 శాతంతో ఈ సీజన్ ముగిస్తుంది. అయితే, లంక కంటే ఇండియా, దక్షిణాఫ్రికాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లంక గెలిచి టాప్-2లో నిలవాలంటే ఆస్ట్రేలియా విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్- దక్షిణాఫ్రికా మొదటి టెస్టు సాగిందిలా.. ఓవర్‌నైట్ స్కోరు ఆదివారం 145/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా లంచ్‌కు ముందే 218 పరుగుల వద్ద ఆలౌటైంది. హెడ్ మరో 14 పరుగులు జతచేసి నిష్క్రమించగా, క్యారీ (22 నాటౌట్), గ్రీన్ (18), స్టార్క్ (14) రెండంకెల స్కోరు చేశారు. రబడ 4, జాన్సెన్ 3 వికెట్లు తీశారు. ఆసీస్‌కు 66 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. జొండో (36; 6 ఫోర్లు) టాప్ స్కోరర్! కమిన్స్ (5/42) నిప్పులు చెరిగాడు. అయితే వాన్ డెర్ డసెన్ (0)ను బౌల్డ్ చేయడంతో స్టార్క్ 300 వికెట్ల క్లబ్లో చేరాడు. అతనికి, బొలాండ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 34 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా... రబడ (4–1–13–4) పేస్ పదునుకు ఆపసోపాలు పడింది. చివరకు 7.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసి నెగ్గింది. ఈ రెండు రోజుల్లో 34 వికెట్లు కూలడం విశేషం. పేస్‌కు బ్యాటర్సంతా విలవిలలాడిన పిచ్‌పై అత్యధిక స్కోరు చేసిన ట్రెవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఇక డిసెంబరు 26 నుంచి ‘బాక్సింగ్ డే’ రెండో టెస్టు మెల్బోర్న్లో జరుగుతుంది. చదవండి: Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో.. Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గన్ సరసన
Teams getting bowled out for below 100 in successive T20 WC matches: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పొట్టి ఫార్మాట్ ప్రపంచక కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు వందలోపే ఆలౌట్ అయిన మూడో జట్టుగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 73 పరుగులకే కుప్పకూలి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి.. చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు, శ్రీలంకతో మ్యాచ్‌లో 88 పరుగులకే ఆలౌట్ అయింది. కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా తొలుత దక్షిణాఫ్రికాతో 84 పరుగులు, ఆసీస్‌తో మ్యాచ్‌లో 73 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లాదేశ్.. ఈ రెండు దేశాల సరసన చేరింది. అంతేగాక... టీ20 మ్యాచ్‌లలో ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు(దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో రెండుసార్లు) వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టుగా మహ్మదుల్లా బృందం నిలిచిన సంగతి తెలిసిందే. కాగా బంగ్లాదేశ్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడం జంపా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి బంగ్లా జట్టు పతనాన్ని శాసించి 8 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: బంగ్లాదేశ్- 73 (15) ఆస్ట్రేలియా- 78/2 (6.2) చదవండి: ICC Player Of The Month: షకీబ్, ఆసిఫ్, డేవిడ్.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
AUS Vs BAN: ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం సమయం 17:44.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. చివర్లో మిచెల్ మార్ష్(5 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఫించ్(40) ఔట్ సమయం 17:33.. 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు), ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. అయితే 5వ ఓవర్ ఆఖరి బంతికి తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆసీస్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐదేసిన జంపా.. 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ సమయం 16:48.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19)దే అత్యధిక స్కోర్ కాగా, మరో ఇద్దరు(నయీమ్(17), మహ్మదుల్లా(16)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. మహ్మదుల్లా(16) ఔట్ సమయం 16:35.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరింది. కెప్టెన్ మహ్మదుల్లా(18 బంతుల్లో 16; 2 ఫోరు) స్టార్క్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 65/8. క్రీజ్‌లో తస్కిన్ అహ్మద్(2), ముస్తాఫిజుర్ ఉన్నారు. 62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:31.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జంపా వేసిన 11వ ఓవర్లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. ఐదో బంతికి షమీమ్ హొసేన్(18 బంతుల్లో 19; ఫోర్, సిక్స్), ఆరో బంతికి మెహిది హసన్(0) ఔటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ ఉన్నారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:05.. బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ నాలుగు, ఐదు ఓవర్లు మినహా అన్నీ ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. జంపా తన స్పెల్ తొలి బంతికే అఫీఫ్ హెసేన్(0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆ జట్టు కేవలం 33 పరుగులు మాత్రమే స్కోర్ చేసి సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా, షమీమ్ హొసేన్ ఉన్నారు. నయీమ్(17) ఔట్..బంగ్లాదేశ్ 32/4 సమయం 15:59.. మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. నాలుగో ఓవర్, ఐదో ఓవర్ గ్యాప్ ఇచ్చి ఆరో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ నయీమ్(16 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(8), అఫీఫ్ హొసేన్ ఉన్నారు. 3 ఓవర్లు 3 వికెట్లు..బంగ్లాదేశ్ స్కోర్ 10/3 సమయం 15:46.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోతుంది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి ఓవర్లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లా.. రెండో ఓవర్లో సౌమ్య సర్కార్.. మూడో ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్(2 బంతుల్లో 1) వికెట్ నష్టపోయింది. ముష్ఫికర్‌ను మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 15:42.. తొలి ఓవర్లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. రెండో ఓవర్లో సౌమ్య సర్కార్(8 బంతుల్లో 5: ఫోర్) వికెట్‌ను చేజార్చుకుంది. రెండో ఓవర్ ఆఖరి బంతికి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్.. 6 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 15:33.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో లిటన్ దాస్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(1), సౌమ్య సర్కార్ ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా గురువారం(నవంబర్ 4) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ సూపర్-12లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. మొత్తం 9 మ్యాచ్‌ల్లో.. ఆసీస్ 5, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అయితే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. ఆసీస్‌తో తలపడిన ప్రతిసారి పరాజయం పాలైంది. 4 మ్యాచ్‌ల్లో నాలుగింటిలోనూ ఓటమిని ఎదుర్కొంది. తుది జట్లు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, షమీమ్ హెసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ -
పోరాడి ఓడిన బంగ్లా
నాటింగ్‌హామ్: సంచలనాల బంగ్లాదేశ్ మరోసారి తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, అన్ని రంగాల్లో తనకంటే బలమైన ఆస్ట్రేలియాపై గెలిచేంత పనిచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్(102 నాటౌట్; 97 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్) అసాధరణ రీతిలో సెంచరీతో పోరాడగా.. తమీమ్(62), మహ్మదుల్లా(69)లు అర్దసెంచరీలు సాధించారు. సీనియర్ ఆటగాడు షకీబ్(41), లిట్టన్ దాస్(20) భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్‌నైల్, స్టొయినిస్, స్టార్క్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా ఒక్క వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాపై వీరవిహారం చేసి భారీ శతకం సాధించిన డేవిడ్ వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గెలుస్తుందా అనిపించేలా.. ఆసీస్ లాంటి బలమైన జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో కనీసం పోరాటం చేయకుండానే బంగ్లా చాపచుట్టేస్తుందనుకున్నారు. అయితే గత బంగ్లా జట్టు కాదని నిరూపిస్తూ ఓటమిని అంత త్వరగా ఒప్పుకోలేదు. ఓ దశలో బంగ్లా పోరాటంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఓడిపోతామనే అనుమానం కలిగింది. అయితే కొంచెం స్కోర్ తక్కువైనా ఆసీస్ ఓడిపోయేదే అని సగటు అభిమాని భావించాడు. ముఖ్యంగా రహీమ్ చివరి వరకు ఉండి విజయం కోసం పోరాడాడు. మహ్మదుల్లా కూడా చివర్లో బ్యాట్ ఝులిపించడంతో లక్ష్యానికి దగ్గరికి వచ్చింది. అయితే భారీ స్కోర్ కావడం, చివర్లో వికెట్లు పడటంతో బంగ్లా ఓటమి ఖాయం అయింది. అంతకుముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166: 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు సారథి ఆరోన్ ఫించ్(53: 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వన్‌డౌన్‌లో ఉస్మాన్ ఖవాజా (89: 72 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381పరుగులు చేసింది చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్ మూడు, ముస్తాఫిజుర్ ఒక్క వికెట్ పడగొట్టారు. అదిరే ఆరంభం... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి నాలుగు ఓవర్లు కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో ఓవర్ నుంచి గేర్ మార్చింది. మోర్తాజా వేసిన ఈ ఓవర్ తొలి బంతినే సిక్సర్ మలచి ఫించ్ తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే, ఇదే ఓవర్ చివరి బంతికి వార్నర్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను పాయింట్లో షబ్బీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వార్నర్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. చకచకా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ 55 బంతుల్లో అర్ధసెంచరీ మార్కు చేరుకున్నాడు. కాసేపటికే ఫించ్ సైతం అర్ధశతకం పూర్తిచేసుకొని ఆ వెంటనే వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ఉస్మాన్ ఖవాజాతో కలసి మరో భారీ భాగస్వామ్యాన్ని(160) నెలకొల్పిన వార్నర్ టోర్నీలో రెండో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో చకచకా 150 దాటిన అతన్ని సౌమ్య సర్కార్ పెవిలియన్‌కు చేర్చాడు. అతని తర్వాత వచ్చిన మాక్స్వెల్ 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, ఆఖరి నాలుగు ఓవర్లలో పుంజుకున్న బంగ్లా బౌలర్లు ఖవాజా, స్టీవ్‌స్మిత్‌లను వెంట వెంటనే పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్ స్కోరు కొంత తగ్గింది. -
వార్నర్ విజృంభణ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో సత్తా చాటింది. డేవిడ్ వార్నర్(166; 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభణకు తోడు ఉస్మాన్ ఖవాజా(89; 72 బంతుల్లో 10 ఫోర్లు), అరోన్ ఫించ్(53;51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ 382 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో విలువైన భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ, ఖవాజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చి మ్యాక్స్‌వెల్(32; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, అనవసరపు పరుగు కోసం క్రీజ్ దాటి రావడంతో రనౌట్ అయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో ఖవాజా ఔట్ కాగా, స్టీవ్ స్మిత్(1)సైతం నిరాశపరిచాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్), అలెక్స్ క్యారీ(11 నాటౌట్)లు దూకుడుగా ఆడటంలో విఫలయ్యారు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మూడు వికెట్లు సాధించగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ వికెట్ తీశాడు. -
వార్నర్ మళ్లీ బాదేశాడు..
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో సెంచరీ బాదేశాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ శతకం సాధించాడు. 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఇది వార్నర్‌కు 16వ వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో మంచి భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ సాధించాడు. దాంతో ఆసీస్ 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. -
మరో సంచలనంపై బంగ్లాదేశ్ గురి
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు సంచలన విజయాలు నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ తాము కూడా రేసులో ఉన్నామంటూ మిగతా జట్లకు సవాల్ విసురుతోంది. దీనిలో భాగంగా గురువారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడుతోంది. సాధారణంగా అయితే ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌కు బంగ్లాదేశ్ ఏమంత క్లిష్ట ప్రత్యర్థి కానేకాదు. కానీ ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్కడి జోరు ముందు ‘కంగారూ’ పడాల్సిందే. ఆ ఒక్కడు షకీబ్ అల్ హసన్. ఈ బంగ్లా ఆల్‌రౌండర్ బ్యాట్‌తో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతితో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. దాంతో బంగ్లాదేశ్‌ను ఆసీస్ నిలువరిస్తుందా అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇదిలా ఉంచితే. ఇరు జట్ల ముఖాముఖి రికార్డులో 21 వన్డేలు జరగ్గా, 18 మ్యాచ్‌లను ఆసీస్ గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒకదాంట్లో మాత్రమే నెగ్గింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్ ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఆసీస్‌నే ఫేవరెట్‌గా దిగుతోంది. అయితే ఊహించని విజయాలు సాధిస్తున్న బంగ్లాదేశ్ మాత్రం మరో షాక్ ఇవ్వాలని యోచిస్తోంది. తుది జట్లు ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మర్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, కౌల్టర్ నైల్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముస్తాఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహిదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్


