మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత.. కపిల్‌దేవ్‌ రికార్డ్‌ బ్రేక్‌ | Mitchell Starc Overtakes Kapil Dev to Reach Massive Milestone in Test Cricket | Sakshi
Sakshi News home page

మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత.. కపిల్‌దేవ్‌ రికార్డ్‌ బ్రేక్‌

Aug 14 2026 3:53 PM | Updated on Aug 14 2026 4:11 PM

Mitchell Starc overtakes Kapil Dev to reach big milestone

PC: X

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ (434)ను మిచెల్ అధిగమించాడు.

డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లిట్టన్ దాస్ వికెట్‌తో స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు. స్టార్క్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 435 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే డేల్ స్టెయిన్ (439) రికార్డును కూడా దాటేసి టాప్-5లోకి అత‌డు అడుగుపెడ‌తాడు.

ప్ర‌స్తుతం స్టార్క్ ఆరో స్ధానంలో ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా మాత్రం స్టార్క్‌నే కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో జేమ్స్ అండర్సన్‌(704) అగ్రస్ధానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు:
జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) – 704

స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604

గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563

కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519

డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 439

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 435*

కపిల్ దేవ్ (భారత్) – 434

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి బంగ్లాదేశ్ 110 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 351 ప‌రుగులు చేసింది. బంగ్లా జట్టు ప్రస్తుతం 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement