ఆసీస్‌ గడ్డపై చ‌రిత్ర సృష్టించిన బంగ్లా ఓపెన‌ర్‌ | Tanzid Hasan Becomes 1st-Bangladesh Cricketer-Test Century-In-Australia | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ గడ్డపై చ‌రిత్ర సృష్టించిన బంగ్లా ఓపెన‌ర్‌

Aug 14 2026 10:41 AM | Updated on Aug 14 2026 10:53 AM

Tanzid Hasan Becomes 1st-Bangladesh Cricketer-Test Century-In-Australia

Photo Credit: Twitter

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెన‌ర్ తంజిద్ హస‌న్ త‌మీమ్ (197 బంతుల్లో 101 ప‌రుగులు) శ‌త‌కంతో చెల‌రేగాడు. డార్విన్ వేదిక‌గా ఆడుతున్న టెస్టులో తంజిద్ త‌న కెరీర్‌లో డెబ్యూ సెంచ‌రీ అందుకున్నాడు. అయితే తంజిద్‌కు ఇది రెండో టెస్టు మ్యాచ్ కావ‌డం విశేషం. 

అంతేకాదు ఆసీస్ గ‌డ్డ‌పై సెంచ‌రీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌క‌ముందు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు హ‌స‌న్ స‌ర్కార్ సాధించిన 76 ప‌రుగులే అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా ఆ రికార్డు క‌నుమ‌రుగైంది. ఓవ‌రాల్‌గా విదేశాల్లో సెంచ‌రీ సాధించిన రెండో బ్యాట‌ర్‌గా తంజిద్ నిలిచాడు. 

2022లో మ‌హ్మ‌దుల్ హ‌స‌న్ డ‌ర్బ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాపై 137 ప‌రుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచ‌రీ సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌గా తంజిద్ మ‌రో రికార్డు అందుకున్నాడు. గ‌తంలో 2006లో షాహ్‌రియ‌ర్ న‌ఫీ 138 ప‌రుగులు చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే బంగ్లాదేశ్ ప్ర‌స్తుతం మూడు వికెట్ల న‌ష్టానికి 269 ప‌రుగులు సాధించింది. న‌జ్ముల్ షాంటో (75 బ్యాటింగ్‌), ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇక తంజిద్‌, న‌జ్ముల్ క‌లిసి మూడో వికెట్‌కు 93 ప‌రుగులు జోడించారు. అంత‌క‌ముందు మోమినుల్ హ‌క్ (49) అర్ధ‌సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌల‌ర్ల ధాటికి 198 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. బంగ్లా బౌల‌ర్ మ‌హ్ముద్ హ‌స‌న్ ఆరు వికెట్లతో చెల‌రేగాడు. ఇదే మ్యాచ్లో త‌స్కిన్ అహ్మ‌ద్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో బంగ్లాదేశ్ బౌల‌ర్‌గా త‌స్కిన్ నిలిచాడు. 

త‌స్కిన్ కంటే ముందు ష‌కీబ్ అల్ హ‌స‌న్ (712 వికెట్లు), ముష్ర‌ఫె మోర్త‌జా (389), ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ (383), మెహ‌దీ హ‌స‌న్ (369 వికెట్లు), తైజుల్ ఇస్లామ్ (302 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ 77 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది.

 

Read: 47 ఏళ్ల వ‌య‌సులో ఇర‌గ‌దీస్తున్న మాజీ స్పిన్న‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement