breaking news
darwin
-
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్‌లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తూ ఓపెనర్ల వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.మరోసారి ఓపెనర్ల పని పట్టిన హసన్హసన్ మహమూద్ బౌలింగ్‌లో తొలుత జేక్ వెదర్లాండ్ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ 35 బంతుల్లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరిని అద్భుతమైన డెలివరీలతో మహమూద్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వెదర్లాండ్ (23), ట్రవిస్ హెడ్ (22) హసన్ మహమూద్ బౌలింగ్‌నే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.అదే తీరుగా మరోసారి బౌల్డ్అయితే, యాధృచ్చికంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే హెడ్ బౌల్డ్ అయ్యాడో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో మహమూద్ బంతితో రంగంలోకి దిగాడు. రెండో బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో మహమూద్ వేయగా.. స్క్వేర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్ బౌల్డ్ అయ్యాడు."I've never seen that in all my cricketing career."Travis Head chopped on for a second time in this match, but his considerate move even caught Adam Gilchrist off guard. #AUSvBAN pic.twitter.com/LEKgbtbshq— cricket.com.au (@cricketcomau) August 15, 2026నా కెరీర్లో ఇలాంటిది చూడలేదుఅయినప్పటికీ ఎంతో సంయమనంగా హెడ్.. బెయిల్స్‌ను తీసి స్టంప్స్ మీద సర్ది నెమ్మదిగా క్రీజును వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కామెంటెరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్.. ‘నా క్రికెటింగ్ కెరీర్లో ఇంత వరకు ఇలాంటిది చూడలేదు’ అని హెడ్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండుసార్లు ఒకే బౌలర్ బౌలింగ్‌లో.. ఒకే విధంగా అవుటైనప్పటికీ.. ప్రశాంతంగా ఉండటం అతడికే చెల్లించిందని చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఆధిపత్యంకాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లాదేశ్ మధ్య గురువారం మరారా స్టేడియంలో తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా 228 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 42 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా కంటే ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: జైస్వాల్‌ను రనౌట్ చేయనా? ఇందులో తప్పేముంది?.. కానివ్వు! -
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్‌తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్‌లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్‌గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్‌స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్‌లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్‌గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్‌తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం -
ముందు బయటకు నడువ్: మిరాజ్‌పై స్టార్క్ ఆగ్రహం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కంగారూలపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా జట్టు తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ కంగారూలకు చుక్కలు చూపించాడు.198 పరుగులకే ఆలౌట్మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితికి చేరుకుంది.తంజిద్ సెంచరీమొత్తంగా 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లా 351 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ సెంచరీ (101)తో కదం తొక్కగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో 84 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 32, హసన్ మహమూద్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.ముందు బయటకు నడువ్ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సహనం కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో స్టార్క్ వేసిన ఐదో బంతిని మిరాజ్ థర్డ్‌మాన్ దిశగా బాది సింగిల్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో మిరాజ్ పిచ్ (డేంజర్ ఏరియా) మధ్య నుంచి పరుగు తీశాడు. దీంతో స్టార్క్ కోపంతో ఊగిపోతూ.. ‘ముందు వికెట్ మీది నుంచి బయటకు నడువు’ అని హెచ్చరించాడు. ఇందుకు మిరాజ్ గట్టిగానే బదులిచ్చాడు. స్టార్క్ అడ్డుగా ఉండటం వల్లే తాను పిచ్ మధ్యలోకి పరుగు తీయాల్సి వచ్చిందని అంపైర్ కుమార్ ధర్మసేనకు చెప్పాడు.అంపైర్ కూడా వార్నింగ్ ఇచ్చాడుదీంతో స్టార్క్, మిరాజ్‌లను విడదీసిన ధర్మసేన.. మిరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే రెండుసార్లు పిచ్ డేంజర్ జోన్లోకి వచ్చావని.. మరోసారి గనుక ఇది పునరావృతమైతే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుందని హెచ్చరించాడు. "Get off the wicket!"Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8— cricket.com.au (@cricketcomau) August 14, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఇప్పటికి రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (20), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (0)లను అవుట్ చేశాడు.చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (197 బంతుల్లో 101 పరుగులు) శతకంతో చెలరేగాడు. డార్విన్ వేదికగా ఆడుతున్న టెస్టులో తంజిద్ తన కెరీర్లో డెబ్యూ సెంచరీ అందుకున్నాడు. అయితే తంజిద్‌కు ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు హసన్ సర్కార్ సాధించిన 76 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా విదేశాల్లో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా తంజిద్ నిలిచాడు. 2022లో మహ్మదుల్ హసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 137 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ మరో రికార్డు అందుకున్నాడు. గతంలో 2006లో షాహ్రియర్ నఫీ 138 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. నజ్ముల్ షాంటో (75 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక తంజిద్, నజ్ముల్ కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. అంతకముందు మోమినుల్ హక్ (49) అర్ధసెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. బంగ్లా బౌలర్ మహ్ముద్ హసన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇదే మ్యాచ్‌లో తస్కిన్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో బంగ్లాదేశ్ బౌలర్‌గా తస్కిన్ నిలిచాడు. తస్కిన్ కంటే ముందు షకీబ్ అల్ హసన్ (712 వికెట్లు), ముష్రఫె మోర్తజా (389), ముస్తాఫిజుర్ రెహ్మన్ (383), మెహదీ హసన్ (369 వికెట్లు), తైజుల్ ఇస్లామ్ (302 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 77 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.Tanzid Hasan has the first Test century of his career! 👏#MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/lXkIJrXHAO— cricket.com.au (@cricketcomau) August 14, 2026 A moment to remember. 💯🇧🇩 Tanzid Hasan Tamim celebrates a maiden Test century in Darwin! What a knock. 🔥🏏#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/WypnVcwYBw— Bangladesh Cricket (@BCBtigers) August 14, 2026Read: 47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్ -
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్‌పై ఫైర్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.చెలరేగిన హసన్ మహమూద్ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్‌లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.198 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.ఆటకు అంతరాయంసెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్‌ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.ఓవరాక్షన్ చేయకుఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంతకు ముందు బంగ్లా బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఆరేసిన మహమూద్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లా మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత డార్విన్‌లోని మరారా స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అనూహ్య రీతిలో 198 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది.ఆది నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు బంగ్లా పేసర్ హసన్ మహమూద్. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23)లతో పాటు.. స్టీవ్ స్మిత్ (71) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (7) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి బంగ్లా బౌలర్గామొత్తంగా ఆసీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మహమూద్.. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.ముఖాముఖి పోరులో హీరోగా..అదే విధంగా.. ఆసీస్- బంగ్లా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా 26 ఏళ్ల మహమూద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ పేసర్ జేసన్ గిల్లెస్పి పేరిట ఉండేది. 2003లో గిల్లెస్పి బంగ్లాదేశ్‌తో టెస్టులో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. మహమూద్ తాజాగా అతడిని అధిగమించాడు.ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు1. మైకేల్ కాస్ప్రోవిక్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 7/392. హసన్ మహమూద్ (బంగ్లాదేశ్)- 2026లో ఆస్ట్రేలియా మీద 6/553. చమిందా వాస్ (శ్రీలంక)- 2004లో ఆస్ట్రేలియా మీద 5/314. గ్లెన్ మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 5/375. స్టువర్ట్ మెక్‌గిల్ (ఆస్ట్రేలియా)- 2003లో బంగ్లాదేశ్ మీద 5/65. చదవండి: వైభవ్ విషయంలో అది నేను అంగీకరించను: ఆసీస్ దిగ్గజంHasan Mahmud’s 6-Wicket Haul vs Australia | 1st Test 🔥🇧🇩 pic.twitter.com/5qaJN4qTss— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2026 -
ఎవల్యూషన్ డే’ని జరుపుకొందాం!
ఇంగ్లిష్ నేచురలిస్ట్ ఛార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది. జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్ ఎవొల్యూ షన్) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.– డా. దేవరాజు మహారాజువ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‘ -
సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోని పరిణామ సత్యం
ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్ డార్విన్ 1859 నవంబర్ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్స్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి. చదవండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.– ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు(నవంబర్ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం) -
హైదరాబాద్‌లో డార్విన్‌బాక్స్ కొత్త హెడ్‌క్వార్టర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల సంస్థ డార్విన్‌బాక్స్ హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సంఖ్య 700గా ఉండగా, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో కలిపి దాదాపు 1,200 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో సిబ్బందిని తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, రాబోయే మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు రోహిత్ వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ విభాగం లాభాలు నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. 2015లో చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని ప్రారంభించిన డార్విన్‌బాక్స్‌కు 700 పైచిలుకు క్లయింట్లు, దాదాపు 20 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సమీకరించిన 72 మిలియన్ డాలర్ల నిధులతో యూనికార్న్ హోదా (బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) దక్కించుకుంది. -
‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్స్ సంస్థలు కుప్పతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశీ టూ–వీలర్ దిగ్గజాలను అంత తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ఏవో కొన్ని స్టార్టప్‌లు అనుకుంటున్నట్లుగా మంచి భారతీయ ద్విచక్ర వాహన కంపెనీలు మరీ అంత తేలికైనవి కాదు. మేము అక్టోబర్‌లో మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తే.. మీకు నవంబర్‌లో చేతికి అందుతుంది. అంతే గానీ 2021లో ఆవిష్కరిస్తే డెలివరీ తీసుకునేందుకు మీరు 2022 దాకా వేచి చూస్తూ కూర్చోనక్కర్లేదు. అది స్టార్టప్‌లు పనిచేసే తీరు. చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజాల పనితీరు అలా ఉండదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. డార్విన్ సిద్ధాంతం 150 సీసీ మించిన స్పోర్ట్స్ మోటర్‌సైకిల్స్ విభాగంలో ఎన్ఫీల్డ్, బజాజ్, టీవీఎస్‌లకు 70–80 శాతం మార్కెట్ వాటా ఉంటుందన్నారు. సరికొత్తగా పల్సర్ 250ని ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ విషయాలు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్‌ల నుంచి బడా కంపెనీలకు పోటీ ఎదురయ్యే అంశంపై స్పందిస్తూ.. చార్లెస్ డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అత్యంత తెలివైన, బలమైన జీవి కాకుండా మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగించగలవని, సంస్థలకు కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్‌లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్‌కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా చేరిన తొలి విమానం!
కాన్బెర్రా: దేశంలో కోవిడ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గత నెలలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన తొలి విమానం శనివారం డార్విన్ చేరుకుంది. కాంటాస్ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఆస్ట్రేలియా చేర్చారు. విమానంలో బోర్డ్ అవ్వడానికి ముందే వీరంతా రెండు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లు చూపించారు. ఇక వీరందరిని హోవార్డ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కోశాధికారి జోశ్ ఫ్రైడెన్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇక్కడి పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇండియా నుంచి మొదటి విమానం వచ్చిందని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే వారికి పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం. మేం ఇదే అనుసరిస్తున్నాం. ఈ నెలలో మరో రెండు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మా పౌరులను స్వదేశానికి తీసుకురానున్నాయి. జూన్ వరకు 1,000 మంది స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘మా ప్రభుత్వం డార్విన్ నగరానికి ఆగ్నేయంగా 25 కి.మీ (16 మైళ్ళు) దూరాన ఉన్న హోవార్డ్ స్ప్రింగ్స్‌లోని క్వారంటైన్ సెంటర్ సామార్థ్యాన్ని రెంటింపు చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా జూన్‌లో ప్రతి రెండు వారాలకు సుమారు 2,000 మందిని ఆస్ట్రేలియా చేర్చనున్నాం’’ అన్నారు. ఇక భారత్ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ -
‘జెట్’ విక్రయంలో కదలిక!
ముంబై: జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూపు బుధవారం ఎస్బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్ గ్రూపు సీఈవో రాహుల్ గన్‌పులే తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్బీఐ క్యాప్స్ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ కోసం తాము ఈ నెల 8న బిడ్ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్బీఐ క్యాప్స్ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్బీఐ క్యాప్స్ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్ బిడ్ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది. హిందుజాలను ఒప్పించే యత్నం? జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్ హిందుజాతో ఎతిహాద్ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది. మరింత నష్టపోయిన షేరు కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్ ఎయిర్వేస్ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది. -
కోతికి కజిన్లు
తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే ఎక్కువ ప్రమాదకారి. ప్రతి ఒక్క ఫిలాసఫర్ ఎక్కడో ఒక చోట ఈ మాట చెప్పే ఉంటాడు. ఎవరూ చెప్పకపోయినా, ప్రతి ఒక్కరికీ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురయ్యే ఉంటుంది. సత్యపాల్ సింగ్ సెంట్రల్ మినిస్టర్. ఉన్నత విద్యాశాఖకు ఈమధ్యే సెప్టెంబర్‌లో మంత్రిగా వచ్చారు. శనివారం ఔరంగాబాద్‌లో అఖిలభారతీయ వైదిక సమ్మేళంలో ప్రసంగిస్తూ, డార్విన్ సిద్ధాంతం తప్పు అన్నారు. స్కూళ్లలోంచి, కాలేజీల్లోంచి పాఠ్యపుస్తకాల్లో డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతాన్ని తీసెయ్యాలి అన్నారు. ‘‘కోతి నుంచి మనిషి పుట్టాడని డార్విన్ చెప్పాడు. అదే నిజమైతే కోతి నుంచి మనిషి పుట్టడాన్ని మన పూర్వీకులు ఎవరైనా చూసి ఉండాలి కదా! చూసినట్లు ఏ వేదంలోనూ లేదు. మనుషులు రావడం రావడమే భూమ్మీదకు మనుషులుగా వచ్చారు’’ అన్నది సత్యపాల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మర్నాడు, ఆదివారం పుణెలోని సీనియర్ సైంటిస్టులు కొందరు కలిసి కూర్చొని సత్యపాల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ, పన్నెండొందల సంతకాలతో మంత్రిగారి శాఖకు ఒక లేఖ రాశారు! ‘చెప్పండి, డార్విన్ సిద్ధాంతాన్ని పిల్లల పుస్తకాల్లోంచి మీరెలా తీస్తారు?’ అని. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటే ఎలా? వందేళ్లుగా డార్విన్ సిద్ధాంతంపై మా సైంటిస్టులు అధ్యయనాలు చేస్తున్నారు. ఆ ఫలితాలన్నీ కూడా డార్విన్‌ని సమర్థించే విధంగానే ఉన్నాయి. మినిస్టర్ గారికి ఈ మాత్రం జీకే కూడా లేకపోవడం మాకు షాకింగ్‌గా ఉంది’ అని రేడియో ఆస్ట్రోనామర్ గోవింద్ స్వరూప్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ రీడర్ అనికేత్ సూళే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు! నిజానికి వీళ్లేం దిగ్భ్రాంతికి లోనుకానవసరం లేదు. మంత్రిగారి మాటలకు దిగాలు పడనవసరమూ లేదు. సత్యపాల్ తనకు తోచింది అన్నారు తప్ప, తోచినంత పనీ చేయిస్తాడని, ఒకవేళ మోదీని ఒప్పించి చేయించినా డార్విన్ సిద్ధాంతం మరుగున పడిపోతుందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ముఖ్యంగా సైంటిస్టులు. మంత్రిగారు అన్నట్లు లేదా మనమంతా నమ్ముతున్నట్లు .. మనిషి కోతి నుంచి వచ్చాడని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. అసలు ‘మనిషి ఫ్రమ్ కోతి’ అనే మాటే డార్విన్ రాసిన సిద్ధాంత గ్రంథం ‘ది డిస్సెంట్ ఆఫ్ మ్యాన్’లోని ఏ పేజీలోనూ లేదు! ‘కోతి, మనిషి ఒకే చెట్టు కొమ్మలు’ అని డార్విన్ అన్నాడు తప్ప, కోతి ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మకు ఎగిరీ ఎగిరీ చివరికి మనిషైపోయింది అనేమీ సూత్రీకరించలేదు. కోతి, మనిషి కజిన్స్. కజిన్ నుంచి మనిషి రాడు కదా! ఇంత చిన్న విషయం మంత్రిగారి మాటలకు ‘షాక్ తిన్న’ సైంటిస్టులకు తెలియకుండా ఉంటుందా?! మంత్రిగారి వల్ల సైన్స్‌కి వచ్చే నష్టంగానీ, ఆయన మాటలపై సైంటిస్టులు స్పందించకుండా ఉంటే డార్విన్ సిద్ధాంతానికి జరిగే హానిగానీ ఏమీ ఉండదు. సైంటిస్టులు కూల్‌గా ఉంటే పోయేది. తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే డార్విన్‌కి ఎక్కువ ప్రమాదకారి. – మాధవ్ శింగరాజు -
మళ్లీ కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్
సాక్షి, బెంగళూర్ : సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విటర్ లో కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ కు ఈ విలక్షణ నటుడు సూటిగా చురకలు అంటించాడు. ‘‘మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, అయ్యా.. అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా? మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడు’’ అంటూ ప్రకాశ్ రాజ్ మంత్రిని ఉద్దేశించి ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. కాగా, ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని.. కాబట్టి డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు. తక్షణమే ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రిని ట్రోల్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ our ancestors have not seen ape evolving in to man” says minister. But dear sir,..can you deny that we are witnessing..the reverse....man evolving into ape by digging the past and trying to take us back into STONE AGE......#justasking — Prakash Raj (@prakashraaj) 22 January 2018 -
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఔరంగాబాద్ : ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలో డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని పిలుపునిచ్చారు. డార్విన్ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి పురాతన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. డార్విన్ పేర్కొన్న జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని అన్నారు. భూమి ఏర్పడ్డనాటి నుంచి మనిషి.. మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని తెలిపారు. డార్విన్ సిద్ధాంతం తప్పని 35 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు నిరూపించారని గుర్తు చేశారు. -
భారత్ ‘ఎ’కే టైటిల్
ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’పై గెలుపు నాలుగు దేశాల వన్డే టోర్నీ డార్విన్: టోర్నీ అంతటా నిలకడగా ఆడిన భారత ‘ఎ’ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఆతిథ్య ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఫైనల్లో భారత యువజట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరూన్ వైట్ (150 బంతుల్లో 137; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ, ఫిలిప్ హ్యూజెస్ (70 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆసీస్‌కు గట్టి పునాది వేయగా, చివర్లో కటింగ్ (21 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీస్కోరునందించాడు. అనంతరం భారత కుర్రాళ్లు 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి గెలిచారు. ఒక దశలో 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మనోజ్ తివారి (75 బంతుల్లో 50; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (73 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతోపాటు 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మరోసారి భారత్ ఇక్కట్లలో పడింది. ఈ దశలో రిషి ధావన్ (55 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)లు ఏడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’: 50 ఓవర్లలో 274/5 (వైట్ 137, హ్యూజెస్ 51; ధావళ్ కులకర్ణి 3/51); భారత్ ‘ఎ’: 48.4 ఓవర్లలో 275/6 (జాదవ్ 78, రిషి ధావన్ 56 నాటౌట్; కటింగ్స్ 3/46). -
భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం
డార్విన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో గెలిచింది. శనివారం గార్డెన్స్ ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిలీ రోసో (150 బంతుల్లో 137; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. భారత్ ‘ఎ’ 49.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 276 పరుగులు చేసి నెగ్గింది. కరణ్ శర్మ (16 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 15 పాయింట్లతో టాప్‌లో ఉంది. -
భారత్ ‘ఎ’ బోనస్ విజయం
రాణించిన తివారి, పాండే డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’కు తొలి విజయం దక్కింది. ఆదివారం ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో పరాజయం పాలైన భారత్... మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. మనోజ్ తివారి (73 బంతుల్లో 93; 9 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (108 బంతుల్లో 91; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీలు కోల్పోగా, ఉన్ముక్త్ చంద్ (62 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మర్చంట్ డి లాంజ్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.1 ఓవర్లలో 256 పరుగులకే ఆలౌటైంది. హెండ్రిక్స్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆంటాంగ్ (40 బంతుల్లో 48; 5 ఫోర్లు) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ధావల్ కులకర్ణి (5/54) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. భారీ తేడాతో గెలిచిన భారత్‌కు బోనస్ పాయింట్ కూడా లభించింది.


