సెంచరీ దిశగా తంజిద్‌.. బంగ్లా చేతిలో ఆసీస్‌కు చుక్కలు! | Tanzid-Hasan-Half Century-Bangladesh-Eyes Big Score Vs AUS 1st Test | Sakshi
Sakshi News home page

సెంచరీ దిశగా తంజిద్‌.. బంగ్లా చేతిలో ఆసీస్‌కు చుక్కలు!

Aug 14 2026 7:13 AM | Updated on Aug 14 2026 8:28 AM

Tanzid-Hasan-Half Century-Bangladesh-Eyes Big Score Vs AUS 1st Test

Photo Credit: Twitter

డార్విన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జ‌ట్టు భారీ స్కోరు దిశ‌గా అడుగులు వేస్తోంది. ఓపెన‌ర్ షాద్‌మ‌న్ ఇస్లామ్ (20) త‌క్కువ స్కోరుకే వెనుదిరిగిన‌ప్ప‌టికీ, మ‌రో ఓపెన‌ర్ తంజిమ్ హ‌స‌న్ (71 నాటౌట్‌) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హ‌క్ (49) తృటిలో హాఫ్ సెంచ‌రీ మిస్‌ అయ్యాడు.  

ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ పేస‌ర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్ర‌యం వికెట్లు తీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. క‌మిన్స్‌, హాజిల్‌వుడ్‌, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాట‌ర్లు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు సాధించ‌డం విశేషం. 

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌల‌ర్ల ధాటికి 198 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధ‌సెంచ‌రీ చేయ‌గా, మిగ‌తావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హ‌స‌న్ మ‌హ్ముద్ 6 వికెట్ల‌తో ఆసీస్ ప‌తనాన్ని శాసించ‌గా, త‌స్కిన్ అహ్మ‌ద్‌, ఇబ‌ద‌త్ హొస్సేన్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్‌ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా ప‌రుగుల‌ వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుచ‌కున్నాడు.

చదవండి: క్రికెట్‌లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక‌ కోచ్ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement