'నాకు తెలుసు అది అవుటని'.. నిజం ఒప్పుకొన్న స్టీవ్ స్మిత్ | Steve Smiths Blunt Press Conference Answer Sparks Fresh Spirit Of Cricket Controversy | Sakshi
Sakshi News home page

BAN vs AUS: 'నాకు తెలుసు అది అవుటని'.. నిజం ఒప్పుకొన్న స్టీవ్ స్మిత్

Aug 13 2026 6:36 PM | Updated on Aug 13 2026 7:03 PM

Steve Smiths Blunt Press Conference Answer Sparks Fresh Spirit Of Cricket Controversy

ఆస్ట్రేలియాకు వారి సొంత‌గ‌డ్డ‌పై బంగ్లాదేశ్ చుక్క‌లు చూపిస్తోంది. డార్విన్ వేదిక‌గా గురువారం ప్రారంభ‌మైన తొలి టెస్ట్‌లో బంగ్లా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. బంగ్లా బౌల‌ర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 198 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

పేసర్‌ హసన్ మహమూద్ 6 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(71) ఒక్కడే రాణించాడు. అయితే స్మిత్ కూడా తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాల్సి ఉండేది. కానీ సాంకేతిక తప్పిదం వల్ల అతడు కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

అసలేమి జరిగిందంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 21 ఓవ‌ర్ వేసిన బంగ్లాదేశ్ పేసర్ ఎబాదత్ హొస్సేన్.. నాలుగో బంతిని స్మిత్‌కు ఫిప్త్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని స్టీవ్ డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్ ద‌గ్గ‌రగా వెళ్తూ వికెట్ కీప‌ర్ లిట్ట‌న్ దాస్‌కు చేతుల్లో ప‌డింది. వెంటనే వికెట్ కీప‌ర్‌తో పాటు బంగ్లా ఫీల్డ‌ర్లు క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. 

స్మిత్ తాను అవుటయ్యాననే భావనతో స్మిత్ పెవిలియన్ వైపు నడవబోయాడు. కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన నాటౌట్ అని త‌ల ఊపడంతో అంతా షాకయ్యారు. ఈ క్ర‌మంలో  బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో రివ్యూ కోరాడు. 

అయితే థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ 'రియల్-టైమ్ స్నిక్కోమీటర్ (RTS)'ను పరిశీలించగా, బంతి బ్యాట్‌కు తగిలినట్లు ఎటువంటి స్పైక్ కనిపించలేదు. స్నికోలో స్పైక్ రాక‌పోయిన‌ప్ప‌టికి బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న‌ట్లు క్లియ‌ర్‌గా కనిపించింది. కానీ టెక్నాల‌జీనే ప‌రిగ‌ణ‌లోకి  తీసుకున్న నితిన్ మీనన్ త‌న నిర్ణ‌యాన్ని నాటౌట్ ప్ర‌క‌టించాడు. దీంతో బంగ్లా ఆట‌గాళ్లు తీవ్ర నిరాశ‌చెందారు.

ఇక ఇదే విష‌యంపై తొలి రోజు ఆట అనంత‌రం విలేకరుల సమావేశంలో స్మిత్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో త‌న‌కు అదృష్టం కలిసొచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు.

జర్నలిస్ట్: బంతి బ్యాట్‌కు తగిలిందని మీకు అనిపించిందా?

స్మిత్‌: అవును, తగిలిందనే అనుకుంటున్నా! నేను అదృష్టవంతుడిని. కొన్నిసార్లు అలాంటివి మనం స్వీకరించక తప్పదు.

జర్నలిస్ట్: మీరు ఈ టెక్నాలజీ నమ్ముతున్నారా?

స్టీవ్ స్మిత్: "సాధారణంగా 'రియల్-టైమ్ స్నిక్కోమీటర్ టెక్నాలజీ బాగానే పనిచేస్తుంది. బ్యాట్‌కు బంతికి తాకిందో లేదో నాకైతే స్పష్టంగా తెలియదు. కానీ కొంతవరకు ఎడ్జ్ తీసుకున్నట్లే అనిపించింది. అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా ఈరోజు టెక్నాలజీ నన్ను కాపాడింది.! అయితే నెటిజన్లు మాత్రం ఎక్స్‌ వేదికగా స్మిత్‌పై మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడం ఆసీస్‌ ఆటగాళ్లకే అలవాటే అని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement