breaking news
half centuries
-
రూట్ ప్రపంచ రికార్డు.. పాక్‌తో టెస్టులో భారీ ఆధిక్యం
పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (66 పరుగులు) సాధించిన రూట్ టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో సచిన్‌తో (200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు) కలిసి రూట్ (167 టెస్టుల్లోనే) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. మరో అర్ధసెంచరీ సాధిస్తే రూట్ టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతు న్నాడు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా రూట్‌కు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈతరం ఫ్యాబ్-4లో (కోహ్లి, స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్) ఇద్దరు ఇప్పటికే రిటైరవ్వగా.. రూట్, స్మిత్ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.టెస్టు కెప్టెన్‌గా మరో రికార్డుదీంతో పాటు రూట్ టెస్టుల్లో మరో రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రూట్ (42 ఫిఫ్టీలు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ (61), ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, పాక్ మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (43 ఫిఫ్టీలు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.Joe Root 66(112) Vs Pakistan | 1st Test, 2026 - Leeds | Ball By Ball Highlights pic.twitter.com/gbkZ20BOwC— PctMedia (@PctMediaa) August 20, 2026Most fifties in Test cricket:Joe Root - 68*. Sachin Tendulkar- 68. pic.twitter.com/dScWCVxvSn— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2026 -
సెంచరీ దిశగా తంజిద్.. బంగ్లా చేతిలో ఆసీస్‌కు చుక్కలు!
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ తంజిమ్ హసన్ (71 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హక్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ పేసర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్రయం వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించడం విశేషం. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధసెంచరీ చేయగా, మిగతావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హసన్ మహ్ముద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, తస్కిన్ అహ్మద్, ఇబదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్‌ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా పరుగుల వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుచకున్నాడు.చదవండి: క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్‌ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్‌ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్‌లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్‌ఆర్‌హెచ్‌లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్‌ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్‌ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
రికార్డులు బద్దలు కొట్టిన క్లాసెన్
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థశతకం కాగా.. అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 19 అర్థశతకాలతో శిఖర్ దావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ 42 అర్థశతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి దాకా 5 హాఫ్ సెంచరీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ప్రబ్‌సిమ్రన్, అయ్యర్లు నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూనకం! -
గిరాయిపల్లి అమరుల స్ఫూర్తి
గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది. 1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు. ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు(గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు) -
హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో గిల్‌ను ఒక ఎండ్‌లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. ద్వైపాక్షిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ అర్థసెంచరీలు బాదిన ఆరో టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కంటే ముందు క్రిష్ణమాచారి శ్రీకాంత్ వర్సెస్ శ్రీలంక(1982), దిలీప్ వెంగ్‌సర్కార్ వర్సెస్ శ్రీలంక(1985), మహ్మద్ అజారుద్దీన్ వర్సెస్ శ్రీలంక(1993), ఎంఎస్ ధోని వర్సెస్ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ న్యూజిలాండ్(2020) ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గిల్ 61, సంజూ శాంసన్ 18 పరుగులతో ఆడుతున్నారు. क्या किशन का यह फ़ॉर्म उन्हें विश्व कप की भारतीय प्लेइंग-XI में शामिल करवा पाएगा?#WIvIND #ishankishan pic.twitter.com/VmrLVqKrR5 — ESPNcricinfo हिंदी (@CricinfoHindi) August 1, 2023 చదవండి: WTC 2023-25: చివరి టెస్టులో విజయం.. ఆసీస్‌తో సమానంగా ఇంగ్లండ్ -
కోహ్లి అరుదైన ఫీట్.. రికార్డులు కొట్టడానికే పుట్టాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో అర్థసెంచరీతో మెరిశాడు. ఈ సీజన్లో కోహ్లికి ఇది ఆరో ఫిఫ్టీ కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్లో 50వ అర్థశతకం సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. వార్నర్ తర్వాత ఐపీఎల్లో 50 ఫిఫ్టీలు సాధించిన రెండో క్రికెటర్‌గా.. టీమిండియా తరపున తొలి క్రికెటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. వార్నర్ 172 మ్యాచ్‌ల్లో 59 అర్థశతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 233 మ్యాచ్‌ల్లో 50 అర్థశతకాలు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాత శిఖర్ ధావన్ 49 అర్థసెంచరీతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 41 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో, ఏబీ డివిలియర్స్ 40 అర్థసెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు మరో రికార్డు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీపై తొమ్మిదో అర్థసెంచరీ సాధించిన కోహ్లి.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. The 'boy from Delhi' is putting up a stellar show against the Capitals 😍#DCvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/trldI0zEN0 — JioCinema (@JioCinema) May 6, 2023 చదవండి:'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కి -
ఐపీఎల్లో ధావన్ చరిత్ర.. భారత్ తరపున తొలి క్రికెటర్‌గా
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్ వింటేజ్ ధావన్‌ను తలపించాడు. తొలుత ప్రబ్‌సిమ్రన్ సింగ్ రెచ్చిపోతుంటే తాను యాంకర్పాత్ర పోషించాడు. Photo: IPL Website ప్రబ్‌సిమ్రన్ ఔటైన తర్వాత ధావన్ తన ఆట మొదలుపెట్టాడు. చహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదడం ద్వారా ధావన్ అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ధావన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్ స్కోరు కావడం విశేషం. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఇక కింగ్ కోహ్లి 45 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్‌కు ఇది ఏడో హాఫ్ సెంచరీ. Photo: IPL Website అయితే సీఎస్కేపై ధావన్ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్, ఆర్సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 85 పరుగుల ఇన్నింగ్స్ ధావన్‌కు అత్యధిక స్కోరుగా ఉంది. చదవండి: ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్ ధావన్ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్! That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్‌లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన ఫీట్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన వార్నర్ 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్ ఒక రికార్డును అందుకున్నాడు. ఆర్సీబీపై తాజా దానితో కలిపి వార్నర్ 10 అర్థసెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలు వార్నరే ఉన్నాడు. అంతకముంఉద పంజాబ్ కింగ్స్‌పై వార్నర్ 11 అర్థసెంచరీలు సాధించాడు. ఇక కోహ్లి సీఎస్కేపై ఇప్పటివరకు 9 అర్థసెంచరీలు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఐపీఎల్ 2022 సీజన్ కోహ్లికి కలిసిరావడం లేదా! -
టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మ..
Rohit Sharma creates Record in T20s: టి20 క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లి రికార్డును రోహిత్ సమం చేశాడు. రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 55 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్ 118 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా, కోహ్లి 95 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఉన్నాడు. కాగా టీ20ల్లో రోహిత్ 4 సెంచరీలు నమోదు చేయగా, కోహ్లి ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై భారత్ 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే? -
Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్‌కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమైన చోట శార్దూల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్ 336 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా 9, ఉమేశ్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: Kohli Frustration: ఔటయ్యానన్న కోపంలో గోడను కొట్టిన కోహ్లి ENG Vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ We Call Him "LORD SHARDUL" For A Reason😌💙💙💙...Fearless & Aggressive😎💙💙💙...Well Played @imShard 🙌🏻💙...#LordShardul #ShardulThakur #ENGvINDpic.twitter.com/PsYueXD2WD — Bitan Sangram (@IAmBitan45) September 2, 2021 Indian No.8 or lower batsmen scoring two 50+ scores in a Test match: Harbhajan Singh v NZ, Ahmedabad, 2010 Bhuvneshwar Kumar v Eng, Nottingham, 2014 W Saha v NZ, Kolkata, 2016 Shardul Thakur v Eng, The Oval, 2021*#ENGvIND — Umang Pabari (@UPStatsman) September 5, 2021 Lord shardul 🙏🙏#INDvENG #BCCI @imShard pic.twitter.com/yJEtRlBsgR — Don Abhimanyu (@DonAbhimanyu_) September 5, 2021 -
దిగ్గజాల సరసన రాహుల్
పల్లెకెలె: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ (85;135 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా వరుసగా ఏడో హాఫ్ సెంచరీని రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస ఏడు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్ గా రాహుల్ గుర్తింపు పొందాడు. అదే సమయంలో ఆ ఘనతను సాధించిన ఆరో క్రికెటర్ గా రాహుల్ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత సాధించిన వారిలో ఎవర్టెన్ వీక్స్(వెస్టిండీస్), ఆండీ ఫ్లవర్(జింబాబ్వే), చందర్‌పాల్(వెస్టిండీస్), సంగక్కరా( శ్రీలంక), క్రిస్ రోజర్స్(ఆస్ట్రేలి్యా)లు ఉన్నారు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ కు తీవ్ర జ్వరం కారణంగా రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. ఆపై రెండో టెస్టులో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు. భారత తరపున వరుసగా ఆరు టెస్టుల్లో అర్ధ శతకాలు చేసిన వారిలో గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్ లు ఉన్నారు. భారత్ నుంచి వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రాహుల్ రికార్డులకెక్కాడు. భారత గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాహుల్ (90, 51, 67, 60, 51 నాటౌట్) వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. అటు తరువాత శ్రీలంక సిరీస్ రాహుల్ కు మొదటిది. ఇక్కడ కూడా రాహుల్ తన నిలకడను కొనసాగిస్తూ భారత జట్టు విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు. -
విజయ్ 11, రహానే 8
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు సాధించారు. విజయ్ 104 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. టెస్టుల్లో అతడికిది 11 అర్ధసెంచరీ. రహానే టెస్టుల్లో 8వ హాఫ్ సెంచరీ సాధించాడు. 118 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధసెంచరీ బాదాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 228 బంతుల్లో 100 పరుగులు జోడించారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 132/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విజయ్(74), రహానే(55) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటివరకు లంకపై టీమిండియా 219 పరుగుల ఆధిక్యం సాధించింది. -
కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు
-
కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు
దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ మురళీ విజయ్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ తోడయ్యాడు. ఇక పరుగులు వరదలా రావడం మొదలైంది. ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ అర్థసెంచరీలు పూర్తిచేశారు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో శిఖర్ ధవన్ 9 పరుగులకే వెనుదిరగడం కొద్దిసేపు భారత జట్టును నిరాశపరిచినా, ఓవైపు మురళీ విజయ్, మరోవైపు విరాట్ కోహ్లీ చేతికి అందిన చెత్తబంతినల్లా బాదడం మొదలుపెట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మురళీ విజయ్ 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 165 బంతుల్లో 66 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దూకుడు ప్రదర్శించాడు. కేవలం 86 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి.. 66 పరుగులు చేశాడు. దీంతో విజయానికి కేవలం 199 పరుగులు చేస్తే సరిపోయే స్థితికి భారత జట్టు చేరుకుంది.


